తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు...

Published : Jan 27, 2021, 10:39 AM IST
తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు...

సారాంశం

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 147 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరు మృతి చెందారు.

ఇదే సమయంలో 399 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,93,737 కు పెరగగా, ఇప్పటి వరకు 1,593 మంది కరోనాతో మృతి చెందారు. 2,89,325 మంది రికవరీ అయ్యారు. 

ఇక, కరోనా మరణాలు దేశంలో 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతంగా .. రికవరీ రేటు దేశంలో 96.9 శాతంగా ఉంటే రాష్ట్రంలో 98.49 శాతానికి పెరిగిందని బులెటిన్‌ లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,819 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 1,295 హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.
 
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 16,486 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... టెస్ట్‌ల సంఖ్య 77,28,296కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది.
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu