జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

By AN TeluguFirst Published Jan 27, 2021, 10:50 AM IST
Highlights

సికింద్రాబాద్, బోయినపల్లి కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ జరగనుంది. జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌ను నేడు సికింద్రాబాద్ కోర్టు మరోసారి విచారించనుంది. 

సికింద్రాబాద్, బోయినపల్లి కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ జరగనుంది. జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌ను నేడు సికింద్రాబాద్ కోర్టు మరోసారి విచారించనుంది. 

బోయినపల్లి కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి పరారీలో ఉన్నారు. దీంతో అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇప్పటికే భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్‌ను కోర్టు కొట్టి వేసింది.

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై పోలీసులు సోమవారం నాడు సికింద్రాబాద్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

అయితే ఇంతకు ముందు ఆయన బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు అయ్యింది. పరారీలో ఉన్న విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని  కౌంటర్ లో పేర్కొన్నారు. భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్ రావుతో పాటు అతని సోదరులను కిడ్నాప్ చేశారు.

ఈ కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టై ఇటీవలనే విడుదలయ్యారు. ఇదే కేసులో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, జగత్  విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను, చంద్రహాస్ ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ పై  విచారణ సందర్భంగా  ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని జగత్ విఖ్యాత్ రెడ్డి తరపు న్యాయవాది ప్రకటించారు.ఈ పిటిషన్ పై విచారణను సికింద్రాబాద్ కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

click me!