ఉస్మానియాలో దారుణం.. మృతదేహాల మధ్యే కరోనా రోగుల ఐసోలేషన్

By telugu news teamFirst Published Jul 15, 2020, 10:50 AM IST
Highlights

మూడు రోజుల తర్వాత అతనికి తెలిసిన విషయం ఏమిటంటే.. తాను ఓ శవంతో ఆ వార్డును షేర్ చేసుకోవడం. ఈ విషయం తెలిసిన తర్వాత అతను భయంతో వణికిపోయాడు.

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ కాటుకి ప్రతిరోజూ కొన్ని వేల మంది గురౌతున్నారు. కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా... కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినవారిని ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే... కొన్ని ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు దారుణంగా ఉన్నాయని తెలుస్తోంది.

హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రుల్లో చాలా మంది కరోనా రోగులు మృతదేహాలతోనే ఐసోలేషన్ వార్డు షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఓ కరోనా రోగి తాను ఎదుర్కోన్న అనుభవాన్ని తెలిపాడు.

నగరానికి చెందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో... ఐసోలేషన్ కోసం అతనిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల తర్వాత అతనికి తెలిసిన విషయం ఏమిటంటే.. తాను ఓ శవంతో ఆ వార్డును షేర్ చేసుకోవడం. ఈ విషయం తెలిసిన తర్వాత అతను భయంతో వణికిపోయాడు.

అదే హాస్పిటల్ లో దాదాపు 20 మంది కరోనా రోగులను రెండు మృతదేహాలతోపాటు ఐసోలేషన్ లో ఉంచారు. అందుకు వారు అంగీకరించకపోయినా.. బలవంతంగా వారిని ఉంచడం గమనార్హం. కాగా... ఈ ఘటనలు సదరు కరోనా రోగులతోపాటు.. వారి బంధువులను సైతం కలవరపెడుతోంది.

అయితే.. చాలా కేసుల్లో ఆస్పత్రిలో చనిపోయిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించడంలో జాప్యం జరుగుతోంది. అందుకు వారి కరోనా పరీక్షల ఫలితాలు రావడంలో ఆలస్యం కావడంతోనే ఇలా జరుగుతోందని తెలుస్తోంది. వారి ఫలితం వచ్చాక మాత్రమే.. మృతదేహాలను అప్పగిస్తున్నారు. అప్పటి వరకు ఐసోలేషన్ వార్డుల్లోనే ఉంచుతున్నారు. అందుకే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. 

అంతేకాకుండా మృతదేహాలను తరలించే ట్రాలీలు కూడా రెండే ఉన్నాయని.. తాము వాటితోనే రోజుకి పది నుంచి 15 మృతదేహాలను తరలించాల్సి వస్తోందని అక్కడి స్టాఫ్ చెబుతుండటం గమనార్హం. 

click me!