కేటీఆర్‌కి షాక్: రేవంత్‌పై దాఖలు చేసిన పిటిషన్ రిటర్న్ చేసిన కోర్టు

By narsimha lodeFirst Published Sep 20, 2021, 6:23 PM IST
Highlights

హైద్రాబాద్ సిటీ  సివిల్ కోర్టులో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ ను కోర్టు రిటర్న్ చేసింది.. సరైన పత్రాలు లేని కారణంగా కేటీఆర్ పిటిషన్ ను కోర్గు ఈ నిర్ణయం తీసుకొంది.


హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై  నిరసిస్తూ హైద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు రిటర్న్ చేసింది. సరైన పత్రాలు లేని కారణంగా ఈ పిటిషన్ ను తిరస్కరించినట్టుగా కోర్టు తెలిపింది.  పూర్తి ఆధారాలతో  రేపు మరో పిటిషన్ ను దాఖలు చేస్తామని కేటీఆర్ న్యాయవాది తెలిపారు.

also read:ట్విట్టర్‌వార్: రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా దాఖలు చేసిన కేటీఆర్

తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు సిటీ సివిల్  కోర్టులో  పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ పరువు నష్టం దావాకి సంబంధించి కేటీఆర్ సరైన పత్రాలు సమర్పించలేదని కోర్టు తెలిపింది. దీంతో  మరోసారి పిటిషన్ వేయనున్నట్టుగా కేటీఆర్ తరపు న్యాయవాది చెప్పారు. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయమై స్పందించే సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే రేవంత్ రెడ్డి తన పేరును లాగుతున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. తనకు సంబంధం లేకున్నా తప్పుడు ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిపై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు మంత్రి కేటీఆర్.

click me!