ట్విట్టర్‌వార్: రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా దాఖలు చేసిన కేటీఆర్

By narsimha lodeFirst Published Sep 20, 2021, 5:17 PM IST
Highlights


తనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారంపై పరువు నష్టం దావా దాఖలు చేశారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ పిటిషన్ లో కోరారు.

హైదరాబాద్: తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డిపై  పరువు నష్టం దావా వేసినట్టుగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.రాజకీయ దురుద్దేశంతో, అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావాను దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేదని మంత్రి తేల్చి చెప్పారు. ఆయా కేసులతో  తనకు ఎలాంటి సంబంధం లేకున్నా రేవంత్ రెడ్డి దురుద్దేశ పూర్వకంగా తన పేరును వాడుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

also read:కేటీఆర్ తో ముదురుతున్న ట్విటర్ వార్ : గన్ పార్క్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి...

దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ కోర్టులో సోమవారం నాడు కేసు దాఖలు చేశారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల కలిగిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని సైతం ప్రారంభించాలని కేటీఆర్ కోరారు.  తనపై రేవంత్ చేస్తున్న అసత్య ప్రచారాలను గుర్తించి ఇలాంటి దురుద్దేశ కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను తగిన విధంగా శిక్షిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ అన్నారు.
 

click me!