కొండా సవాల్‌కి బండి సై: ప్రజా సంగ్రామయాత్ర తర్వాత ఎక్కడికైనా వస్తా

By narsimha lode  |  First Published Sep 20, 2021, 5:48 PM IST

డ్రగ్స్ టెస్టుకు తాను సిద్దమని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన తర్వాత టెస్టు కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ఆయన తెలిపారు.


హైదరాబాద్:చేవేళ్ల  మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వైట్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని  బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆయన తేల్చి చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన ఈ మేరకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సవాల్ కి స్పందించారు.

 ప్రజాసంగ్రామ యాత్ర తర్వాత టెస్టు కోసం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ఆయన చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన తన పాదయాత్ర ముగియనుందన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత తాను టెస్టుల కోసం వస్తానని బండి సంజయ్ చెప్పారు.తనకు ఎలాంటి అలవాట్లు లేవని ఆయన తెలిపారు.

Latest Videos

undefined

also read:ట్విట్టర్‌వార్: రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా దాఖలు చేసిన కేటీఆర్

బాగా బలిసి బలుపు ఎక్కినోడే డ్రగ్స్ తీసుకొంటాడని బండి సంజయ్ చెప్పారు.  కేసీఆర్ ప్రభుత్వం   చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.ప్రజా సమస్యలపై  ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారా అని  బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. తనపై రాజద్రోహం కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసు విషయమై స్పందిస్తూ తాను డ్రగ్స్ టెస్టు కోసం సిద్దమని ప్రకటించారు. కేటీఆర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి  పరీక్షలకు సిద్దమా అని ప్రశ్నించారు. ఈ మేరకు వారిద్దరికి ఛాలెంజ్ విసిరారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కి సవాల్ విసిరారు. ఈ సవాల్ కి బండి సంజయ్ సై అన్నారు.

click me!