టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష.. ప్రజాప్రతినిధుల కోర్ట్ సంచలన తీర్పు

Siva Kodati |  
Published : Jul 07, 2021, 05:45 PM ISTUpdated : Jul 07, 2021, 05:46 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష.. ప్రజాప్రతినిధుల కోర్ట్ సంచలన తీర్పు

సారాంశం

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజాప్రతినిధుల కోర్ట్ షాకిచ్చింది. ఆయనకు జైలు శిక్ష విధించింది. 2015లో జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి విచారణ జరిపిన న్యాయస్థానం.. నాగేందర్‌ను దోషిగా నిర్థారించింది. దీనిలో భాగంగా ఆయనకు 6 నెలల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. 

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజాప్రతినిధుల కోర్ట్ షాకిచ్చింది. ఆయనకు జైలు శిక్ష విధించింది. 2015లో జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి విచారణ జరిపిన న్యాయస్థానం.. నాగేందర్‌ను దోషిగా నిర్థారించింది. దీనిలో భాగంగా ఆయనకు 6 నెలల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా, కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం కొనసాగిన దానం నాగేందర్.. 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి  ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

Also Read:ఊపిరున్నంతవరకు టీఆర్ఎస్ లోనే.. : దానం నాగేందర్

మరోవైపు పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ దానం నాగేందర్ శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ లో చిచ్చుపెట్టేవారికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్న వారిమీద ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్న వారు ఎలా పనిచేస్తారో అందరికీ తెలుసునన్నారు. రేవంత్ నాయకత్వంలో ఎలా పనిచేస్తారో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ లో తనకు చాలా అవమానాలు జరిగాయన్నారు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?