జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు: సాయంత్రం విడుదలయ్యే ఛాన్స్

By narsimha lodeFirst Published Sep 24, 2018, 1:41 PM IST
Highlights

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డికి సోమవారం నాడు బెయిల్ మంజూరైంది


హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డికి సోమవారం నాడు బెయిల్ మంజూరైంది. మనుషుల అక్రమ రవాణా చేస్తున్నారనే కేసులో జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మనుషుల అక్రమ రవాణా కేసులో  సెప్టెంబర్ 11వ తేదీన  పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైల్లో జగ్గారెడ్డి ఉన్నాడు.

అయితే ఈ కేసు విచారణ విషయమై  సెప్టెంబర్ 19వ తేదీన జగ్గారెడ్డిని మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. కస్టడీ ముగిసిన తర్వాత జైల్లో హాజరుపర్చారు.

ఇదిలా ఉంటే  జగ్గారెడ్డి బెయిల్‌కు ధరఖాస్తు చేసుకోగా...కోర్టు ఆయనకు సోమవారం నాడు బెయిల్‌ను మంజూరు చేసింది.  ఈ బెయిల్ రావడంతో సోమవారం నాడు  జగ్గారెడ్డి జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

మనుషుల అక్రమరవాణా: 3 రోజుల పోలీసు కస్టడీకి జగ్గారెడ్డి

మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టు

తప్పించుకునేందుకు జగ్గారెడ్డి ఎత్తు: సంగారెడ్డి బంద్ కు పిలుపు

మాకు పాస్‌పోర్టులే లేవు: జగ్గారెడ్డి భార్య నిర్మల

click me!