నాగార్జునసాగర్: జానారెడ్డికి షాకిచ్చిన నోముల భగత్, బిజెపి డిపాజిట్ గల్లంతు

By telugu teamFirst Published May 2, 2021, 8:08 AM IST
Highlights

తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎప్పటికప్పుడు మీకు ట్రెండ్స్ అందిస్తున్నాం. ఈ లైవ్ అప్ డేట్స్ చూస్తూ ఉండండి.

నాగార్జునసాగర్ శానసశభ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కాంగ్రెసు దిగ్గజం జానారెడ్డికి షాక్ ఇచ్చారు. నోముల భగత్ జానారెడ్డిపై 18 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు బిజెపికి డిపాజిట్ గల్లంతైంది. అయితే, నోముల భగత్ కు జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చినట్లే భావించవచ్చు.

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు దిశగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సాగుతున్నారు. 21వ రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయన 15,522 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మెజారిటీ 15 వేలు దాటింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నోముల భగత్ 20వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 15,070 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

నాగార్జునసాగర్ లో 19 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మెజారిటీ 14,475కు చేరుకుంది. దాదాపుగా టీఆర్ఎస్ విజయం ఖాయమైంది.

నాాగార్జునసాగర్ లో నోముల భగత్ మెజారిటీ 11 వేల ఓట్లు 18వ రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి నోముల భగత్ 13,396 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇంకా 7 రౌండ్లు లెక్కించాల్సి ఉంది.

టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మెజారిటీ 11 వేలు దాటింది. 17వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి నోముల భగత్ జానారెడ్డిపై 11,581 ఓట్ల మెజారిటీ సాధించారు.

నాగార్జునసాగర్ లో 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి నోముల భగత్ మెజారిటీ 10 వేలు దాటింది. జానారెడ్డిపై ఆయన 10,158 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. సొంత మండలం అనుమలలో కూడా జానారెడ్డి తన ప్రభావం చూపలేకపోయారు.

టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 15వ రౌండు ఓట్ల లెక్కింపు ముగిసే సరికి జానారెడ్డిపై 9,914 ఓట్ల మెజారిటిలోకి వచ్చారు.

నాగార్జునసాగర్ లో 14వ రౌండులో నోముల భగత్ మెజారిటీ కాస్తా తగ్గింది. దీంతో ఆయన ప్రస్తుతం జానారెడ్డిపై 9,498 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 13వ రౌండు ఓట్ల లెక్కింపు ముగిసేసరికి 10,581 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

నాగార్జునసాగర్ లో 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 10వేలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయన జానారెడ్డిపై 10,361 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు 

నాగార్జున సాగర్ ఎన్నిక ఓట్ల లెక్కింపులో 11 రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మళ్లీ పుంజుకున్నారు. ఆయన కాంగ్రెసు అభ్యర్థి జానారెడ్డిపై 9106 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మెజారిటీ పదో రౌండులో కాస్తా తగ్గింది. పదో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆయన 7936 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో 9 వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 8111 ఓట్ల మెజారిటీతో జానారెడ్డిపై కొనసాగుతున్నారు

నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భాగత్ మెజారిటీ రౌండు రౌండుకూ పెరుగుతోంది. తాజాగా నోముల భగత్ 7,948 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

నాగార్జునసాగర్ లో ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి నోముల భగత్ జానారెడ్డిపి 6,592 ఓఠ్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ జానారెడ్డిపై 5177 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి భగత్ ఆ ఆధిక్యాన్ని సాధించారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ జానారెడ్డిపై 4334 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. 

నోముల భగత్ నాలుగో రౌండులోనూ అధిక్యం సాధించారు. ఆయనకు నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి 3457  ఓట్ల ఆధిక్యం లభించింది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మూడో రౌండ్ ఓట్ల లెక్కింపులో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యం సాధించారు. ఆయన జానారెడ్డిపై 2665 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులోనూ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యం సాధించారు. ఆయనకు కాంగ్రెసు అభ్యర్థి జానారెడ్డిపై 2216 ఆధిక్యం లభించింది.

నాగార్జన సాగర్ ఉప ఎన్నిక పోస్టల్ ఓట్లలో టీఆర్ఎస్ అధిక్యంలో ఉంది. నోముల భగత్ కు 1,475 ఓట్ల ఆధిక్యం లభించింది.

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. నాగార్జునసాగర్ లో 41 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ సెంటర్ల వద్ద 144వ సెక్షన్ విధించారు. కోవిడ్ కారణంగా విక్టరీ ర్యాలీలను ఎన్నికల సంఘం నిషేధించింది.

టీఆర్ఎస్ తరఫున నోముల భగత్, కాంగ్రెసు నుంచి కె. జానారెడ్డి, బిజెపి తరఫున రవి నాయక్ పోటీ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మృతితో నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ జరిగింది. 

కాగా. నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధిస్తారని ఎగ్టిట్ పోల్స్ తేల్చాయి. నోముల భగత్ 20వేలకు పైగా మెజారిటీ విజయం సాధిస్తారని ఆరా అనే సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టం చేసింది. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి షాక్ తప్పదని తేల్చింది.

టీఆర్ఎస్ కు 95,801 (50.48 శాతం) ఓట్లు వస్తాయని, కాంగ్రెసుకు 75,779 (39.93 శాతం) ఓట్లు వస్తాయని, ఇతరులు 6,224 (3.28 శాతం) ఓట్లు వస్తాయని చెప్పింది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బిజెపి నాగార్జునసాగర్ లో నామమాత్రం ఓట్లు మాత్రమే సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 

నోముల భగత్  21,486 ఓట్ల మెజారిటీ సాధిస్తారని మిషన్ చాణక్య కూడా తేల్చి చెప్పింది. ఆయనకు 93,450 ఓట్లు వస్తాయని మిషన్ చాణక్య చెప్పింది. కాంగ్రెసు అభ్యర్థి జానారెడ్డికి 71,964 ఓట్లు వస్తాయని చెప్పింది. 

హెచ్ఎంఆర్ సంస్థ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధిస్తారని చెప్పింది. అయితే ఆయనకు కేవలం 6,263 ఓట్ల మెజారిటీ మాత్రమే వస్తుందని తేల్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు 78,095 (41.15 శాతం) ఓట్లు, కాంగ్రెసు అభ్యర్థి జానారెడ్డికి 71,832 (37.85 శాతం), బిజెపి అభ్యర్థి రవి నాయక్ కు 17,573 (9.26 శాతం) ఓట్లు వస్తాయని ఆ సంస్థ తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. 

click me!