మరికొద్దిసేపట్లో సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్

Siva Kodati |  
Published : May 02, 2021, 07:22 AM IST
మరికొద్దిసేపట్లో సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్

సారాంశం

తెలుగు రాష్ఠ్రాల్లో ఉత్కంఠను రేపిన నాగార్జున సాగర్ ఉపఎన్నిక కౌంటింగ్ మరికొద్దిసేపట్లో జరగనుంది. నల్గొండలోని అర్జాలబావి సమీపంలో ని ( తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ) ఎఫ్.సి.ఐ గోదాముల్లో కోవిడ్ నిబంధలకు అనుగుణంగా అధికారులు కౌంటింగ్‌కి ఏర్పాట్లు చేశారు. 

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు  2,20,206 కాగా.. మొత్తం పాలైన ఓట్లు 1,89,782. ఉపఎన్నిక సందర్భంగా మొత్తం 86.18 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలో 1400 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. 41 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  

కౌంటింగ్‌కు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే రెండు విడతలుగా శిక్షణ పూర్తి చేసారు.  కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే సిబ్బందికి కౌంటింగ్ హల్‌లోకి అనుమతి ఉంటుంది. ఎన్నికల సంఘం నిబంధల ప్రకారం అభ్యర్ధులు, కౌంటింగ్ ఏజెంట్‌లు, సిబ్బంది, అధికారులకు, పోలీసులకు  మీడియా సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

రెండు హల్స్‌లో హల్‌కు 7 టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుల్స్‌లో 25 రౌండ్లల్లో లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉండగా కోవిడ్ కేసుల దృష్ట్యా ఇతరులు ఎవరు కౌంటింగ్ కేంద్రం వద్దకు రావద్దని అధికారులు సూచించారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్