తనని తాను చెప్పుతో కొట్టుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్..!

Published : Sep 01, 2021, 10:45 AM IST
తనని తాను చెప్పుతో కొట్టుకున్న కాంగ్రెస్  కౌన్సిలర్..!

సారాంశం

ప్రజలు తనను కొట్టకముందే తన చెప్పుతో తానే కొట్టుకుంటున్నానని చెప్పుతో కొట్టుకున్నారు. కమిషనర్‌ రామాంజులరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు.

వార్డు అభివృద్ధి చేయడంలో తాను విఫలమయ్యానని.. ప్రజలు తనని  కొట్టకముందే తనని తాను కొట్టుకుంటానంటూ.. ఓ కౌన్సిలర్ చెప్పుతో కొట్టుకున్నాడు. ఈ సంఘటన సూర్యాపేటలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట మున్సిపల్ కార్యక్రమంలో  మంగళవారం కౌన్సిల్ సమావేశం చోటుచేసుకుంది. కాగా.. 12వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడంలేదని, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నానన్నారు. తన వార్డుపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ నిధులు కేటాయించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రజలు తనను కొట్టకముందే తన చెప్పుతో తానే కొట్టుకుంటున్నానని చెప్పుతో కొట్టుకున్నారు. కమిషనర్‌ రామాంజులరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు. కాంగ్రెస్‌ కౌన్సిలర్లు కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశా రు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల వార్డులకు అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఎజెండా కాపీలను పోడియం వద్ద విసిరేసి, అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌