రవాణా శాఖ అధికారి కాళ్లు పట్టుకున్న కార్పొరేటర్(ఫోటో)

By sivanagaprasad KodatiFirst Published Aug 20, 2018, 4:18 PM IST
Highlights

హెవీ లోడ్ తో హయత్ నగర్ మీదుగా హైదరాబాద్ సిటీలోకి వస్తున్న టిప్పర్ లారీ వంటి వాహనాలను నిలపివేయాలని కోరుతూ హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధిక లోడు రవాణాని అదుపు చేయండి అంటూ రవాణా శాఖ అధికారుల కాళ్లు పట్టుకున్నారు. 

హైదరాబాద్: హెవీ లోడ్ తో హయత్ నగర్ మీదుగా హైదరాబాద్ సిటీలోకి వస్తున్న టిప్పర్ లారీ వంటి వాహనాలను నిలపివేయాలని కోరుతూ హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధిక లోడు రవాణాని అదుపు చేయండి అంటూ రవాణా శాఖ అధికారుల కాళ్లు పట్టుకున్నారు. 

కార్పొరేటర్, రవాణాశాఖ అధికారుల కాళ్లు పట్టుకోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కంగారు పడ్డ రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటామని కొర్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డికి హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా కంకర తరలిస్తున్న టిప్పర్ లారీలు అధిక లోడుతో హయత్ నగర్ మీదుగా సిటీలోకి వస్తుండటంతో రోడ్లు పాడవుతున్నాయని కార్పొరేటర్ తిరుమల్ రెడ్డి వాపోతున్నారు. 

టిప్పర్ లారీలపై కేసులు నమోదు చేసి అధికలోడ్ రవాణాన్ని అరికట్టాలని పదేపదే అధికారులను కోరుతున్నారు. ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడంతో తనదైన శైలిలో నిరసన తెలిపారు. 
 

click me!