షాక్: తల్లిని నమ్మించి 7 ఏళ్ల ఆయూష్‌ను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు

Published : Aug 20, 2018, 01:14 PM ISTUpdated : Sep 09, 2018, 12:32 PM IST
షాక్: తల్లిని నమ్మించి 7 ఏళ్ల ఆయూష్‌ను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు

సారాంశం

బిస్కట్లు ఇస్తామని ఏడేళ్ల బాలుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాలుడిని  ఆయూష్‌గా గుర్తించారు.

హైదరాబాద్:  బిస్కట్లు ఇస్తామని ఏడేళ్ల బాలుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాలుడిని  ఆయూష్‌గా గుర్తించారు.

కాన్పూర్‌ వెళ్లేందుకు ఓ మహిళ తన ఏడేళ్ల కొడుకుతో  బాలుడిని  తీసుకొని  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది.  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని నెంబర్ 1 ఫ్లాట్‌ఫామ్‌‌లో ఉంది.

అయితే ఆ సమయంలో ఇద్దరు మహిళలు వచ్చి బాలుడికి బిస్కట్లు ఇప్పిస్తామని తల్లికి చెప్పి ఆ బాలుడికి తీసుకెళ్లారు. క్షణంలో ఆ బాలుడితో పాటు  ఇద్దరు మహిళలు కన్పించకుండాపోయారు.

అయితే బిస్కట్ల కోసం వెళ్లిన తన కొడుకు కూడ కన్పించకపోయేసరికి ఆ బాలుడి తండ్రి ఆందోళన చెందింది. వెంటనే పోలీసలుకు ఫిర్యాదు చేసింది.  ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీపుటేజీని పరిశీలించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  నుండి  ఇద్దరు మహిళలు ఆ బాలుడిని తీసుకొని వెళ్లినట్టు గుర్తించారు. ఆ ఇద్దరు మహిళలు ఎవరనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు. తనకు ఎవరిపై కూడ అనుమానం లేదని  బాలుడి తల్లి చెబుతోంది.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌ లో స్పా కి వెళుతున్నారా..? మీరు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే
IMD Rain Alert : హైదరబాదీలు బిఅలర్ట్.. సాయంత్రం ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే, ఇక్కడ 51 మి.మీ వర్షపాతమే..!