రూ.40వేలు ఆశచూపి.. ఇద్దరు చిన్నారులను వ్యభిచార కూపంలోకి

Published : Aug 20, 2018, 02:42 PM ISTUpdated : Sep 09, 2018, 01:37 PM IST
రూ.40వేలు ఆశచూపి.. ఇద్దరు చిన్నారులను వ్యభిచార కూపంలోకి

సారాంశం

 ఆ ఇద్దరు బాలికల కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో.. ఒక్కో బాలికకు రూ.40వేలు ఆశచూపించి  వారిని ఈ వ్యభిచార కూపంలోకి తీసుకువచ్చినట్లు తేలింది.

వ్యభిచార నిర్వాహకులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తూనే ఉన్నా.. యాదగిరి గుట్టలో బాలికల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా యాదాద్రి భువనగిరి పోలీసులు గుట్టలో పలు వ్యభిచార గృహాలపై దాడులు చేసి మరో ఇద్దరు బాలికలను పోలీసులు రక్షించారు. 

యాదగిరి గుట్ట సమీపంలో వ్యభిచారం ఇంకా జరుగుతుందనే అనుమానంతో పోలీసులు ఆదివారం కూడా అక్కడ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక నిర్వాహకురాలిని అరెస్టు చేసి.. ఇద్దరు చిన్నారులను ఆ నరకం కూపంలో నుంచి బయటపడేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఆ ఇద్దరు బాలికల కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో.. ఒక్కో బాలికకు రూ.40వేలు ఆశచూపించి  వారిని ఈ వ్యభిచార కూపంలోకి తీసుకువచ్చినట్లు తేలింది. వీరు మాత్రమే కాదు... చాలా మంది అనాథ బాలికలను కూడా వీరు ఈ నరకంలోకి తీసుకువస్తున్నారని తెలిసింది.

ఇప్పటికే ఈ వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న నలుగురు మహిళలను అరెస్ట్ చేయగా.. తాజాగా మరో మహిళను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Top 5 Startups : హైదరాబాద్ లో ప్రారంభమై గ్లోబల్ స్థాయికి ఎదిగిన టాప్ 5 స్టార్టప్స్ ఇవే
Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?