కరోనా వైరస్: హైద్రాబాద్‌లో కేంద్ర వైద్య బృందం పర్యటన

By narsimha lodeFirst Published Jan 28, 2020, 11:28 AM IST
Highlights

కరోనా వైరస్ రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర వైద్య బృందం తలెంగాణ వైద్యులకు పలు సూచనలు చేసింది. 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ కు చెందిన వైద్యులు బృందం  రాష్ట్రంలో  పర్యటిస్తోంది.  వైద్య బృందంలో చెన్నై, హైద్రాబాద్, ఢిల్లీ, బెంగుళూరుకు చెందిన వైద్య  నిపుణులు ఉంటారు. 

వైద్య  బృందంలో చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, చెందిన ప్రముఖ వైద్యులు ఉన్నారు.  హైద్రాబాద్ పీవర్  ఆసుపత్రిలో  కరోనా వైరస్  బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డులో  40 బెడ్స్ ఏర్పాటు చేశారు.

ఈ వార్డులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఇప్పటికే నలుగురు కరోనా వైరస్  బారినపడినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే ఇద్దరి నమూనాలను పూణెకు పంపితే నెగిటివ్ గా వచ్చింది. మరో ఇద్దరి నమూనాలకు సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది.

చైనాలో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.చైనాలో హెల్త్ ఎమర్జెన్సీని విధించారు.  శ్రీలంక దేశానికి కూడ వ్యాధి వ్యాప్తి చెందింది. మరో వైపు బీహార్ రాష్ట్రంలో కూడ ఇదే రకమైన  లక్షణాలతో ఓ రోగి ఆసుపత్రిలో చేరారు.

రాష్ట్రంలోని ఛాతీ ఆసుపత్రిని కేంద్ర వైద్య  బృందం పరిశీలించి పలు సూచనలు చేసింది. బాగా చలిగా ఉన్న ప్రాంతంంలోనే ఈ వ్యాధి త్వరగా విస్తరించే అవకాశం ఉన్నట్టుగా వైద్య బృందం చెబుతోంది. 

 తెలంగాణ రాష్ట్రంలో ఉదయం పూట సగటున 30 డిగ్రీల సెల్సియస్, రాత్రిపూట 20 నుండి 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అవుతున్నాయి.కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలపైనే ఎక్కువగా కేంద్రీకరించాల్సి ఉందని  వైద్య నిపుణులు సూచించారు. 

click me!