చెట్టుని ఢీకొట్టిన స్కూల్ బస్సు... ఇంజిన్ లో ఇరుక్కుపోయిన విద్యార్థి

Published : Jan 28, 2020, 10:20 AM ISTUpdated : Jan 28, 2020, 10:21 AM IST
చెట్టుని ఢీకొట్టిన స్కూల్ బస్సు... ఇంజిన్ లో ఇరుక్కుపోయిన విద్యార్థి

సారాంశం

ఇంజిన్ లో ఇరుక్కుపోయిన చిన్నారి ప్రాణాలు కాపాడారు. గ్యాస్ కట్టర్ సాయంతో విద్యార్థిని స్థానికులు బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 25మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. 


నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం నల్లవెల్లిలో ఓ స్కూల్ బస్సు.. చెట్టుని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని చాలా మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. కాగా... ఓ విద్యార్థి కాళ్లు మాత్రం బస్సు ఇంజన్ లో ఇరుక్కుపోయాయి. కాగా... ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు.

Also Read మసాజ్ పేరుతో వల.. వ్యభిచారం గుట్టురట్టు

ఇంజిన్ లో ఇరుక్కుపోయిన చిన్నారి ప్రాణాలు కాపాడారు. గ్యాస్ కట్టర్ సాయంతో విద్యార్థిని స్థానికులు బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 25మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. బస్సును అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాగా... గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

iBomma Ravi : అసలు ఐబొమ్మ నాది అని చెప్పింది ఎవడు..? ఫస్ట్ టైమ్ నోరువిప్పిన రవి !
Bandi Sanjay About Akhanda 2: బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ ని చూసా: బండి సంజయ్ | Asianet News Telugu