తెలంగాణలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 3 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. హైదరాబాదులో మరోసారి కరోనా విజృంభణ కనిపించింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తద్వారా మరోసారి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణలో 3018 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో లక్షా 11 వేల 688కి చేరుకుంది.
గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ తో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మరణాల సంఖ్య 780కి చేరుకుంది. హైదరాబాదులో మరోసారి కరోనా విజృంభణ కనిపిస్తోంది. గత 24 గంటల్లో హైదరాబాదులో 475 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1060 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 85223కు చేరుకుంది. ఇంకా 25685 మంది కరోనాతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో మరోసారి కరోనా విజృంభించింది. గత 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో కూడా 204 కేసులు రికార్డయ్యాయి. నల్లగొండ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో 190 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో జిల్లాలవారీగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
ఆదిలాబాదు 28
భద్రాద్రి కొత్తగూడెం 95
జిహెచ్ఎంసి 475
జగిత్యాల 100
జనగామ 52
జయశంకర్ భూపాలపల్లి 20
జోగులాంబ గద్వాల 37
కామారెడ్డి 76
కరీంనగర్ 127
ఖమ్మం 161
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 11
మహబూబ్ నగర్ 56
మహబూబాబాద్ 60
మంచిర్యాల 103
మెదక్ 40
మేడ్చెల్ మల్కాజిగిరి 204
ములుగు 26
నాగర్ కర్నూలు 38
నల్లగొండ 190
నారాయణపేట 14
నిర్మల్ 41
నిజామాబాద్ 136
పెద్దపల్లి 85
రాజన్న సిరిసిల్ల 69
రంగారెడ్డి 247
సంగారెడ్డి 61
సిద్ధిపేట 88
సూర్యాపేట 67
వికారాబాద్ 21
వనపర్తి 46
వరంగల్ రూరల్ 61
వరంగల్ అర్బన్ 139
మొత్తం కేసులు 3018
Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 26.08.2020) pic.twitter.com/psqt5vhh2O
— Dr G Srinivasa Rao (@drgsrao)