తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణలో వేయికిపైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులోనే 500కు పైగా కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాదులో కరోనా వైరస్ కట్టడి కావడం లేదని ఎప్పటికప్పుడు రికార్డవుతున్న కేసుల సంఖ్య తెలియజేస్తోంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 60717కు చేరుకుంది.
కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో కోవిడ్ -19 వ్యాధి వల్ల 13 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 505కు చేరుకుంది. హైదరాబాదులో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. గత 24 గంటల్లో హైదరాబాదులో 521 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
undefined
రంగారెడ్డి, మేడ్చెల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. రంగారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో 289 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చెల్ జిల్లాలో 151 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 102 కేసులు రికార్డయ్యాయి.
జిల్లాలవారీగా గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....
ఆదిలాబాద్ 18
భద్రాద్రి కొత్తగూడెం 27
జిహెచ్ఎంసి 521
జగిత్యాల 15
జనగామ 22
జయశంకర్ భూపాలపల్లి 20
జోగులాంబ గద్వాల 28
కామారెడ్డి 11
కరీంనగర్ 97
ఖమ్మం 26
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 6
మహబూబ్ నగర్ 41
మహబూబాబాద్ 39
మంచిర్యాల 18
మెదక్ 15
మేడ్చెల్ మల్కాజిగిరి 151
ములుగు 16
నాగర్ కర్నూలు 9
నల్లగొండ 61
నారాయణపేట 9
నిర్మల్ 12
నిజామాబాద్ 44
పెద్దపల్లి 21
రాజన్న సిరిసిల్ల 30
రంగారెడ్డి 289
సంగారెడ్డి 33
సిద్ధిపేట 24
సూర్యాపేట 37
వికారాబాద్ 12
వనపర్తి 23
వరంగల్ రూరల్ 18
వరంగల్ అర్బన్ 102
Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 30.07.2020) pic.twitter.com/Fq8gIPlYds
— Dr G Srinivasa Rao (@drgsrao)