తెలంగాణలో కరోనా ఉధృతి: లక్షా 67 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Sep 18, 2020, 08:49 AM IST
తెలంగాణలో కరోనా ఉధృతి: లక్షా 67 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కోవిడ్  పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 67 వేలు దాటింది. హైదరాబాదులో గత 24 గంటల్లో 300కు పైగా కేసులు రికార్జయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ 2 వేలకు పైగానే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2043 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షా 67 వేల 46కు చేరింది. 

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1016కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు లక్షా 35 వేల 357 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇంకా 30,673 యాక్టివ్ కేసులున్నాయి. 

హైదరాబాదులో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో హైదరాబాదులో 314 మందికి కరోనా సోకింది. జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుుతన్న సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో గత 24 గంటల్లో జిల్లాలవారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి...

ఆదిలాబాద్ 19
భద్రాద్రి కొత్తగూజెం 49
జిహెచ్ఎంసీ 314
జగిత్యాల 42
జనగామ 25
జయశంకర్ భూపాలపల్లి 23
జోగులాంబ గద్వాల 17
కామారెడ్డి 31
కరీంనగర్ 114
ఖమ్మం 84
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 20
మహబూబ్ నగర్ 26
మహబూబాబాద్ 74
మంచిర్యాల 25
మెదక్ 25
మేడ్చెల్ మల్కాజిగిరి 144
ములుగు 16
నాగర్ కర్నూలు 32
నల్లగొండ 131
నారాయణపేట 12
నిర్మల్ 16
నిజామాబాద్ 65
పెద్దపల్లి 48
రాజన్న సిరిసిల్ల 46
రంగారెడ్డి 174
సంగారెడ్డి 71
సిద్ధిపేట 121
సూర్యాపేట 51
వికారాబాద్ 20
వనపర్తి 22
వరంగల్ రూరల్ 33
వరంగల్ అర్బన్ 108
యాదాద్రి భువనగిరి 45

 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం