శ్రావణి కేసు.. బయటపడుతున్న అశోక్ రెడ్డి దారుణాలు

Published : Sep 18, 2020, 07:31 AM ISTUpdated : Sep 18, 2020, 07:39 AM IST
శ్రావణి కేసు.. బయటపడుతున్న అశోక్ రెడ్డి దారుణాలు

సారాంశం

శ్రావణి ఆర్థిక పరిస్థితిని అడ్డంపెట్టుకొని అశోక్‌రెడ్డి వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. శ్రావణికి పలుమార్లు అశోక్‌ రెడ్డి ఆర్థికసాయం చేశాడు. ఆర్థికసాయం నెపంతో శ్రావణిపై అశోక్‌రెడ్డి జులుం ప్రదర్శించినట్లు చెబుతున్నారు. 

సీరియల్ నటి శ్రావణి కేసులో నిర్మాత అశోక్ రెడ్డి ని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా..  అతను చేసిన దారుణాలు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూస్తున్నాయి. శ్రావణి ఆర్థిక పరిస్థితి తనకు ఆసరాగా మార్చుకొని.. అశోక్ రెడ్డి ఆమెను చిత్ర హింసలకు గురిచేసినట్లు తెలిసింది. 2017లోనే శ్రావణితో అశోక్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి పలుమార్లు ఆమెకు ఆర్థికంగా సహాయం చేసిన అశోక్ రెడ్డి... ఆ తర్వాత ఆమెను దారుణంగా వాడుకున్నట్లు తెలుస్తోంది.

అశోక్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఓ సినిమాలో శ్రావణికి ఓ చిన్న పాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శ్రావణిని అన్ని విధాలుగా అశోక్‌రెడ్డి వాడుకున్నట్లు సమాచారం. శ్రావణి ఆర్థిక పరిస్థితిని అడ్డంపెట్టుకొని అశోక్‌రెడ్డి వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. శ్రావణికి పలుమార్లు అశోక్‌ రెడ్డి ఆర్థికసాయం చేశాడు. ఆర్థికసాయం నెపంతో శ్రావణిపై అశోక్‌రెడ్డి జులుం ప్రదర్శించినట్లు చెబుతున్నారు. తనను కాదని ఎవరిని వివాహం చేసుకోవద్దని అశోక్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలినట్లు చెబుతున్నారు. 

శ్రావణి చనిపోయినరోజు కూడా అశోక్‌రెడ్డి శ్రావణి ఇంటికొచ్చాడు. శ్రావణి కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు. అదే సమయంలో శ్రావణి ఇంటికి కూడా సాయి వచ్చాడు. సాయి, అశోక్‌రెడ్డి శ్రావణిని టార్చర్ చేసినట్లు చెబుతున్నారు. ఇద్దరి వేధింపులను ఆమె దేవరాజ్‌తో షేర్‌ చేసుకుంది. సాయి, అశోక్‌రెడ్డిలను దూరం చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని దేవరాజ్‌ కండీషన్ పెట్టాడు. దీంతో కొన్నాళ్ల నుంచి శ్రావణిని దేవరాజ్‌రెడ్డి దూరంపెట్టాడు. ముగ్గురు వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం