తెలంగాణ సచివాలయం కొత్త భవన నిర్మాణం: టెండర్ల ఆహ్వానం

Published : Sep 17, 2020, 06:02 PM IST
తెలంగాణ సచివాలయం కొత్త భవన నిర్మాణం: టెండర్ల ఆహ్వానం

సారాంశం

కొత్త సచివాలయం  నిర్మాణానికి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ టెండర్లను పిలిచింది.  ఇటీవలనే తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేశారు. అన్ని హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయ భవనాన్ని కూల్చివేసింది.


హైదరాబాద్: కొత్త సచివాలయం  నిర్మాణానికి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ టెండర్లను పిలిచింది.  ఇటీవలనే తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేశారు. అన్ని హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయ భవనాన్ని కూల్చివేసింది.

also read:తెలంగాణ సచివాలయం కూల్చివేత: పరిశీలించిన ఎన్జీటీ బృందం

కొత్త సచివాలయ నిర్మాణానికి సుమారు రూ. 750 కోట్లు ఖర్చు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది.  ఈ నెల 18వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు టెండర్లు స్వీకరిస్తారు.  ఈ నెల 26న ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తారు. 

అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం టెక్నికల్ బిడ్స్ వేస్తారు. అక్టోబర్ 5వ తేదీన ఎర్రమంజిల్ కార్యాలయంలో రోడ్లు భవనాల కార్యాలయంలో ప్రైస్ బిడ్స్ వేస్తారు.కొత్త సచివాలయం భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులను మంజూరు చేసింది.

ఇదిలా ఉంటే సచివాలయ కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీ  ఎంపీ రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Teacher Suspend for Making Reels:పాటలుపాడలేదు పాఠాలునేర్పించా.. బోరుమన్న టీచర్ | Asianet News Telugu
Goa Tour : కేవలం రూ.3500 తో లగ్జరీ బస్సులో గోవా టూర్... 3 నైట్స్, 4 డేస్ ఎంజాయ్