తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 77 వేలు దాటింది. గత 24 గంటల్లో 2 వేలకుపైగా కేసులు రికార్డయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో 2257 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77513కు చేరుకుంది. కాగా, గత 24 గంటల్లో మరో 14 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 615కు చేరుకుంది.
గత 24 గంటల్లో హైదరాబాదులో 500కు తక్కువగా కేసులు నమోదు కావడం విశేషం. జిహెచ్ఎంసీ పరిధిలో 464 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కరీంనగర్ లో సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో కరీంనగర్ జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, వరంగల్ అర్భన్ జిల్లాల్లో యధాస్థితి కొనసాగుతోంది. మేడ్చెల్ మల్కాజిరిగి జిల్లాలో 138 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 181 కేసులు రికార్డయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 187 కేసులు నమోదయ్యాయి.
undefined
జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కరోనా కేసులు
ఆదిలాబాద్ 26
భద్రాద్రి కొత్తగూడెం 79
జిహెచ్ఎంసీ 464
జగిత్యాల 49
జనగామ 18
జయశంకర్ భూపాలపల్లి 38
జోగులాంబ గద్వాల 95
కామారెడ్డి 76
కరీంనగర్ 101
ఖమ్మం 69
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 0
మహబూబ్ నగర్ 45
మహబూబాబాద్ 23
మంచిర్యాల 44
మెదక్ 14
మేడ్చెల్ మల్కాజిగిరి 138
ములుగు 20
నాగర్ కర్నూలు 13
నల్లగొండ 61
నారాయణపేట 9
నిర్మల్ 18
నిజామాబాద్ 74
పెద్దపల్లి 84
రాజన్న సిరిసిల్ల 78
సంగారెడ్డి 92
సిద్ధిపేట 63
సూర్యాపేట 25
వికారాబాద్ 13
వనపర్తి 19
వరంగల్ రూరల్ 16
వరంగల్ అర్బన్ 187
యాదాద్రి భువనగిరి 24
మొత్తం 2,256
Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 08.08.2020) pic.twitter.com/gZb93U3MWI
— Dr G Srinivasa Rao (@drgsrao)