హైదరాబాదులో కట్టడి కాని కరోనా: తెలంగాణలో 64 వేలు దాటిన కేసులు

Published : Aug 01, 2020, 09:45 AM ISTUpdated : Aug 01, 2020, 09:46 AM IST
హైదరాబాదులో కట్టడి కాని కరోనా: తెలంగాణలో 64 వేలు దాటిన కేసులు

సారాంశం

హైదరాబాదులో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. గత 24 గంటల్లో మరోసారి 500కు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 64 వేలు దాటింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో తెలంగాణలో 2083 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 64,786కు చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ మృతులసంఖ్య 530కి చేరుకుంది. 

హైదరాబాదులో మాత్రం కరోనా వైరస్ ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. తాజాగా గత 24 గంటల్లో జిహెచ్ఎెంసీ పరిధిలో 578 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చెల్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఎక్కువగాకరోనా వైరస్ కేసుల నమోదవుతున్నాయి.  

కరీంనగర్ జిల్లాలో 108, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 197,  వరంగల్ అర్బన్ జిల్లాలో 134 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ కోరనా విజృంభిస్తోంది. తాజాగా ఈ జిల్లాలో 228 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో కూడా 101 కేసులు రికార్డయ్యాయి.

జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది.

ఆదిలాబాద్ 17
భద్రాద్రి కొత్తగూడెం 35
జిహెచ్ఎంసీ 578
జగిత్యాల 21
జనగామ 21
జయశంకర్ భూపాలపల్లి 24
జోగులాంబ గద్వాల 35
కామారెడ్డి 18
కరీంనగర్ 108
ఖమ్మం 32
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 8
మహబూబ్ నగర్ 31
మహబూబాబాద్ 40
మంచిర్యాల 37
మెదక్ 16
మేడ్చెల్ మల్కాజిగిరి 197
ములుగు 19
నాగర్ కర్నూలు 18
నల్లగొండ 48
నారాయణపేట 9
నిర్మల్ 25
నిజామాబాద్ 73
పెద్దపల్లి 42
రాజన్న సిరిసిల్ల 39
రంగారెడ్డి 228
సంగారెడ్డి 101
సిద్ధిపేట 16
సూర్యాపేట 34
వికారాబాద్ 21
వనపర్తి 9
వరంగల్ రూరల్ 39
వరంగల్ అర్బన్ 134
యాదాద్రి భువనగిరి 10
మొత్తం కేసులు 2083

 

PREV
click me!

Recommended Stories

Today Gold Rate:పసిడి ప్రియులకు Good News.. తగ్గిన బంగారం ధరలు! | 13April2026 | Asianet News Telugu
Summer Heat : ఏంటిది సూరీడూ.. తెలుగు నేలపై 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలా..! ఆలిండియా రికార్డులు బద్దలవుతాయా..?