తెలంగాణలో కరోనా జోరు: లక్షా 74 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Sep 22, 2020, 09:28 AM IST
తెలంగాణలో కరోనా జోరు: లక్షా 74 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తూనే ఉంది. తెలంగాణ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 74 వేల మార్కును దాటింది. హైదరాబాదులో ఈ రోజు కాస్తా కేసుల సంఖ్య పెరిగింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి ఆగడం లేదు. ప్రతి రోజూ 2 వేలకుపైగానే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 2166 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసులు లక్షా 74 వేల 774కు చేరుకున్నాయి. 

తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా గత 24 గంటల్లో పది మంది మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 1052కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 2143 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షా 44 వేల073కు చేరుకుంది. ఇంకా 29649 యాక్టివ్ కేసులున్నాయి. 

హైదరాబాదులో గత 24 గంటల్లో 300కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్ాలలో 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

తెలంగాణలో గత 24 గంటల్లో జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసులు నమోదు ఇలా ఉంది...

ఆదిలాబాద్ 21
భద్రాద్రి కొత్తగూడెం 79
జిహెచ్ఎంసీ 309
జగిత్యాల 21
జనగామ 79
జయశంకర్ భూపాలపల్లి 20
కామారెడ్డి 50
కరీంనగర్ 127
ఖమ్మం 87
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 19
మహబూబ్ నగర్ 28
మహబూబాబాద్ 90
మంచిర్యాల 43
మెదక్ 36
మేడ్చెల్ మల్కాజిగిరి 147
ములుగు 22
నాగర్ కర్నూలు 46
నల్లగొండ 113
నారాయణపేట 11
నిర్మల్ 22
నిజామాబాద్ 90
పెద్దపల్లి 50
రాజన్న సిరిసిల్ల 51
రంగారెడ్డి 166
సంగారెడ్డి 44
సిద్ధిపేట 88
సూర్యాపేట 64
వికారాబాద్ 24
వనపర్తి 33
వరంగల్ రూరల్ 23
వరంగల్ అర్బన్ 95
యాదాద్రి భువనగిరి 48

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇరాన్‌లో యుద్ధం... హైద‌రాబాద్‌లో పూరీ, దోసెలు బంద్ చేస్తున్న హోట‌ళ్లు. అస‌లేంటీ లాజిక్
Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu