తెలంగాణలో కరోనా ఉధృతి: లక్షా 69 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Sep 19, 2020, 09:05 AM IST
తెలంగాణలో కరోనా ఉధృతి: లక్షా 69 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 69 వేల మార్కు దాటింది. హైదరాబాదులో గత 24 గంటల్లో 305 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. హైదరాబాదులో మాత్రం తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణలో 2123 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షా 69 వేల 169కి చేరుకుంది.

కరోనా వైరస్ కారణంగా గత 24 గంటల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య తెలంగాణలో 1025కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 2115 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షా 37 వేల 508కి చేరుకుంది. ఇంకా 30636 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

హైదరాబాదులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ వంటి జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 

జిల్లాలవారీగా తెలంగాణలో గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది.

ఆదిలాబాద్ 19
భద్రాద్రి కొత్తగూడెెం 53
జిహెచ్ఎంసీ 305
జగిత్యాల 53
జనగామ 28
జయశంకర్ భూపాలపల్లి 23
జోగులాంబ గద్వాల 26
కామారెడ్డి 72
కరీంనగర్ 112
ఖమ్మం 93
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 16
మహబూబ్ నగర్ 33
మహబూబాబాద్ 77
మంచిర్యాల 30
మెదక్ 34
మేడ్చెల్ మల్కాజిగిరి 149
ములుగు 20
నాగర్ కర్నూలు 40
నల్లగొండ 135
నారాయణపేట 18
నిర్మల్ 23
నిజామాబాద్ 78
పెద్దపల్లి 48
రాజన్న సిరిసిల్ల 43
రంగారెడ్డి 185
సంగారెడ్డి 59
సిద్ధిపేట 87
సూర్యాపేట 65
వికారాబాద్ 22
వనపర్తి 26
వరంగల్ రూరల్ 29
వరంగల్ అర్బన్ 81
యాదాద్రి భువనగిరి 41

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇరాన్‌లో యుద్ధం... హైద‌రాబాద్‌లో పూరీ, దోసెలు బంద్ చేస్తున్న హోట‌ళ్లు. అస‌లేంటీ లాజిక్
Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu