సర్పంచ్‌తో ఎమ్మెల్యే తండ్రి వాగ్వాదం: పోలీసులకు ఫిర్యాదు

Published : Sep 18, 2020, 06:12 PM IST
సర్పంచ్‌తో ఎమ్మెల్యే తండ్రి వాగ్వాదం: పోలీసులకు ఫిర్యాదు

సారాంశం

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ తండ్రి సీతారాములు  ప్రభుత్వ స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును అడ్డుకొన్నారు.


ఇల్లందు: ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ తండ్రి సీతారాములు  ప్రభుత్వ స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును అడ్డుకొన్నారు.

డంపింగ్ యార్డు భూమి తనదంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. డంపింగ్  యార్డు విషయంలో చంచుపల్లి సర్పంచ్ ను బెదిరించారు.  నీ అంతు చూస్తానని ఎమ్మెల్యే తండ్రిపై సర్పంచ్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

 గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని  గ్రామపంచాయితీ పాలక వర్గం నిర్ణయం తీసుకొంది. అయితే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనుకొన్న స్థలం తనదని సీతారాములు గ్రామపంచాయితీ సిబ్బందితో గొడవకు దిగాడు. 

ఈ విషయాన్ని గ్రామపంచాయితీ సిబ్బంది సర్పంచ్ కు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా అక్కడికి చేరుకొన్న సర్పంచ్ తో ఎమ్మెల్యే తండ్రి గొడవకు దిగాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగిపోయింది..

దీంతో నీ అంతు చూస్తానని సీతారాములు గొడవకు దిగినట్టుగా సర్పంచ్ ఆరోపిస్తున్నాడు. దీంతో ఆయన స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Gallantry Award : సాధారణ తెలుగు కానిస్టేబుల్ కి శౌర్య పతకం.. ఎవరీ మర్రి వెంకట్ రెడ్డి..? ఏ సాహసం చేశాడు..?
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి... ఈ తెలుగు జిల్లాల్లో రిపబ్లిక్ డే కూడా వర్షాలే