కరోనా ఎఫెక్ట్: ఈ నెల 13 నుండి 10 రోజులు పెద్దపల్లిలో లాక్‌డౌన్

By narsimha lodeFirst Published Jul 12, 2020, 2:26 PM IST
Highlights

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 13వ తేదీ నుండి 10 రోజుల పాటు లాక్ డౌన్ నిర్వహించనున్నారు.  ఇవాళ నిర్వహించిన మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారుల సమావేశంలో ఈ  మేరకు నిర్ణయం తీసుకొన్నారు.

పెద్దపల్లి:పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 13వ తేదీ నుండి 10 రోజుల పాటు లాక్ డౌన్ నిర్వహించనున్నారు.  ఇవాళ నిర్వహించిన మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారుల సమావేశంలో ఈ  మేరకు నిర్ణయం తీసుకొన్నారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇవాళ నిర్వహించిన మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. 

also read:దారుణం: కరోనా రోగిపై దాడికి యత్నం, ఆదుకొన్న ఇంటి యజమాని

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ నిర్వహించడం ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని భావిస్తున్నారు. పెద్దపల్లిలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో  ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఆదివారం నాడు కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో 10 రోజుల పాటు స్వచ్చంధంగా లాక్ డౌన్ పాటించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

నిత్యావసర వస్తువులు, కూరగాయలు మాత్రమే  కొద్దిపాటి సమయం పాటు విక్రయించాలని  నిర్ణయం  తీసుకొన్నారు. ప్రజలంతా  ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు. కరోనా సోకకుండా ఉండేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 33 వేలకు చేరాయి.శనివారం నాడు ఒక్కరోజే 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో 348 మంది మరణించారు. 
 

click me!