హైదరాబాద్ పై కరోనా పంజా.. ఒక్క రోజులో 40పాజిటివ్ కేసులు

By telugu news team  |  First Published May 15, 2020, 11:14 AM IST

గత 24గంటల్లో 40మందికి పైగా కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు గుర్తించారు. గ్రేటర్ పరిధిలోనే ఎక్కవ కేసులు నమోదు కావడం అందరినీ కలవరపెడుతోంది.


తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గినట్లే అనిపించిన కరోనా కేసులు మళ్లీ శరవేగంగా పెరిగిపోతున్నాయి.మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కేసులు ఎక్కువయ్యాయి. గత 24గంటల్లో 40మందికి పైగా కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు గుర్తించారు. గ్రేటర్ పరిధిలోనే ఎక్కవ కేసులు నమోదు కావడం అందరినీ కలవరపెడుతోంది.

మాదన్నపేటలోని ఆర్‌ఆర్‌ మిడోస్‌ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న ఒకే కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఆ కుటుంబంలో వృద్ధుడు(63), అతడి భార్య(62), వీరి కుమారుడు(37), ఇతడి 8, 4 ఏళ్ల కుమారులు, ఇంట్లో పనిచేసే మహిళ(34)కు వైరస్‌ సోకింది. ఇదే అపార్ట్‌మెంట్‌లో రెండో అంతస్తులో నివసిస్తున్న వ్యక్తికి ఈనెల 10నపాజిటివ్‌ రాగా, బుధవారం అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కూడా పాజిటివ్‌ అని తేలింది. అతడి భార్య, కూతురుతోపాటు 11 మందిని క్వారంటైన్‌కు తరలించగా వీరిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. 

Latest Videos

undefined

సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో తాజాగా మరో ఆరుగురికి పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మలక్‌పేట సలీంనగర్‌లో నివసిస్తున్న ఆటో డ్రైవర్‌ (40)కు పాజిటివ్‌ వచ్చింది. బుధవారం ఫీవర్‌ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న 12 మంది కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. 

బాలాపూర్‌ మండలం, మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో మంగళవారం దంపతులకు పాజిటివ్‌ వచ్చింది. తాజాగా సదరు కుటుంబంలోని మరో ఐదుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సైఫ్‌ కాలనీకి చెందిన వ్యక్తి(54)కి పాజిటివ్‌ వచ్చింది. ఈనెల 11న కింగ్‌కోఠి ఆస్పత్రిలో అతడి రక్త నమూనాలను పరీక్షించగా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సైఫ్‌ కాలనీకి చెందిన వ్యక్తి(54)కి పాజిటివ్‌ వచ్చింది. ఈనెల 11న కింగ్‌కోఠి ఆస్పత్రిలో అతడి రక్త నమూనాలను పరీక్షించగా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

click me!