తొలి బాధితుడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించగా... కోలుకొని ఇటీవల డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరాడు. కాగా... బాధితుల కుటుంబసభ్యులను కూడా ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణలో మరో కరోనా కేసు నమోదైంది. ఇప్పటి వరకు రెండు కరోనా కేసులను గుర్తించగా.. తాజాగా మూడో కేసును అధికారులు గుర్తించారు. నెదర్లాండ్ నుంచి 10 రోజుల కిందట రాష్ట్రానికి వచ్చిన రంగారెడ్డి జిల్లావాసి(48) కి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం కలగడంతో.. అతని సాంపిల్స్ ని పూణేకి పంపించారు.
కాగా.. ఆ పరీక్షల్లో అతినికి కరోనా సోకిందని నిర్థారణ అయ్యింది. కాగా... సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ హోస్టెస్ లో మాత్రం ఈ వైరస్ లేదని నిర్థారించారు. దీంతో ఇప్పటివరకు మూడో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు దుబాయి నుంచి రాగా.. రెండో బాధితురాలు మలి నుంచి వచ్చారు. కాగా... ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి కావడం గమనార్హం.
undefined
తొలి బాధితుడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించగా... కోలుకొని ఇటీవల డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరాడు. కాగా... బాధితుల కుటుంబసభ్యులను కూడా ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Also Read కరోనావైరస్: మహారాష్ట్రలో మరో ఐదు పాజిటివ్ కేసులు, భారత్ లో 102...
ఇదిలా ఉండగా...ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ లో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా... అతనికి వైద్యసేవలు అందించిన వారిపై కూడా అధికారులు దృష్టిసారించారు. మొత్తం అతనికి 34మంది వైద్యం అందించగా.. వారిలో ఇద్దరికి లక్షణాలు సోకినట్లు అనుమానం కలగడంతో వారిని రక్తనమూనాలకు కూడా పరీక్షల నిమిత్తం పూణే పంపారు. వారిని కూడా ఇతరులకు దూరంగా ఉంచుతున్నారు.
కరోనా బాధిత కేసులు కొత్తగా రెండు నమోదవ్వడంతో సదరు బాధితులు గత వారం రోజులుగా ఎవరెవరిని కలిశారు అనే విషయంపై కూడా అధికారులు దృష్టి సారించారు. కాగా... ఇప్పటి వరకు కరోనా బాధితులంతా విదేశాల నుంచి వచ్చినవారే కావడం గమానార్హం.
అంతర్జాతీయ విమానాల్లో రాష్ట్రానికి వస్తున్న ప్రతి ఒక్కరి సమాచారాన్ని వైద్య ఆరోగ్యశాఖ సేకరిస్తోంది. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్ అధికారుల సహకారం తీసుకుంటుంది. పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్కానింగ్ చేసి ఆరోగ్య శాఖ అంతర్గత వెబ్ సైట్ లో పొందుపరుస్తున్నారు.