తెలంగాణ గవర్నర్ తమిళిసైపై వల్గర్ పోస్టులు: నటుడి అరెస్టు

Published : Mar 15, 2020, 10:56 AM IST
తెలంగాణ గవర్నర్ తమిళిసైపై వల్గర్ పోస్టులు: నటుడి అరెస్టు

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ యాక్టర్ సాదిక్ బాషాను పోలీసులు అరెస్టు చేశారు. తన ఫేస్ బుక్ ఖాతాలో సాదిక్ బాషా అనుచిత వ్యాఖ్యలు పెట్టినట్లు ఫిర్యాదు అందింది.

చెన్నై: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై అనుచిత పోస్టులు పెట్టిన సహాయ నటుడిని శుక్రవారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. తిరువారూరు జిల్లా మన్నార్ గుడి ఆరిసికడై వీధికి చెందిన సాదిక్ బాషా (39)గా ఆయనను గుర్తించారు. ఆయన కలవాణి -2 చిత్రంలో సహాయ నటుడిగా నటించాడు. మరికొన్ని సినిమాల్లో కూడా నటించాడు. 

కొన్నాళ్ల క్రితం  తన ఫేస్ బుక్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసైని కించపరుస్తూ పోస్టులు పెట్టినట్లు సమాచారం. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిపై బిజెపి నేత రఘురామన్ మన్నార్ గుడి నగర పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై మీద సాదిక్ బాషా అనే వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో అనుచిత పదజాలం వాడి పోస్టులు పెట్టాడని, అందువల్ల అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారని పోలీసులు చెప్పారు. దాంతో అతనిపై కేసు నమోదు చేశారు. 

కేసు నమోదు చేసిన తర్వాత సాదిక్ బాషా కోసం గాలిస్తూ వచ్చార. చివరకు తిరుత్తురైపూండి సమీపంలోని కట్టిమేడు గ్రామంలో తన అత్తారింట్లో ఉన్న సాదిక్ బాషాను పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ