తెలంగాణలో కరోనా విజృంభణ: 88 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Aug 14, 2020, 08:45 AM IST
తెలంగాణలో కరోనా విజృంభణ: 88 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 88 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో 1921 కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే నిన్నటి కన్నా ఈ రోజు తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 1921 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88,396కు చేరుకుంది. 

కాగా, తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 9 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 674కు చేరుకుంది. హైదరాబాదులో ఈ రోజు కూడా తక్కువగానే కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో ఎప్పటిలాగే కేసులు నమోద్యయాయి.

జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

ఆదిలాబాద్ 28 
భద్రాద్రి కొత్తగూడెం 34
జిహెచ్ఎంసి 356
జగిత్యాల 40
జనగామ 38
జయశంకర్ భూపాలపల్లి 21
జోగులాంబ గద్వాల 51
కామారెడ్డి 44
కరీంనగర్ 73
ఖమ్మం 71
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 17
మహబూబ్ నగర్ 48
మహబూబాబాద్ 38 
మంచిర్యాల 18
మెదక్ 39
మేడ్చెల్ మల్కాజిగిరి 168 
ములుగు 12
నాగర్ కర్నూలు 26
నల్లగొండ 73
నారాయణపేట 6
నిర్మల్ 37
నిజామాబాద్ 63
పెద్దపల్లి 54
రాజన్న సిరిసిల్ల 33
రంగారెడ్డి 134
సంగారెడ్డి  90 
సిద్ధిపేట 63
సూర్యాపేట 47
వికారాబాద్ 14
వనపర్తి 41
వరంగల్ రూరల్ 54
వరంగల్ అర్బన్ 74
యాదాద్రి భువనగిరి 16
మొత్తం 1921

 

PREV
click me!

Recommended Stories

Kavitha Emotional Speech: నా మీద కక్ష కట్టి పార్టీ నుంచి నెట్టేశారు | Asianet News Telugu
Agriculture : ఎకరాకు రూ.10 లక్షల లాభం..! ఇలా కదా వ్యవసాయం చేయాల్సింది, ఇది కదా రైతులకు కావాల్సింది