అమీన్ పురా దుర్ఘటన: మరో బాలికపైనా లైంగిక అఘాయిత్యం

Published : Aug 14, 2020, 07:07 AM IST
అమీన్ పురా దుర్ఘటన: మరో బాలికపైనా లైంగిక అఘాయిత్యం

సారాంశం

అమీన్ పురాలోని మారుతి అనాథాశ్రమంలో మరిన్ని అఘాయిత్యాలు జరిగాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అమీన్ పురా అనాథాశ్రమంలో లైంగిక దాడికి గురైన బాలిక చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పురా లోని మారుతి అనాథాశ్రమంలో మరో ఘటన కూడా జరిగినట్లు తెలుస్తోంది. మారుతి అనాథాశ్రమంలో 14 ఏళ్ల బాలిక వరుస అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ బుధవారం మరణించిన విషయం తెలిసిందే. తన మాదిరిగానే మరో బాలిక కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు కొన్ని రోజుల క్రితం తనతో చెప్పినట్లు మృతురాలి పిన్ని ప్రీతి చెప్పించారు. 

ఆ బాలిక కూడా అస్వస్థతకు గురి కావడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి నిలదీశారని, అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయ బెదిరించడంతో వాళ్లు తమ కూతురిని తీసుకుని వెళ్లిపోయారని మృతురాలు చెప్పినట్లు ఆమె చెప్పారు. 

బాలిక మృతి కేసులో ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. అతను అనాథాశ్రమంలోని 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అనాథాశ్రమం నిర్వాహకురాలు చెలుకూరు విజయ, ఆమె సోదరుడు సూరపనేని జయదీప్ అతనికి సహకరించారు. రెండో బాలికపై కూడా వేణుగోపాల్ రెడ్డి అత్యాచారం చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అత్యాచారానికి గురైన బాలిక మర్మాంగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఇన్ ఫెక్షన్ ఏర్పడిందని, అది శరీరానికి పాకడంతో సెప్టిసియాతో మరణించిందని నీలోఫర్ వైద్యులు చెప్పారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతనే అసలు కారణాలు తెలుస్తాయి. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్