హైదరాబాద్ కు కోవిడ్19 వ్యాక్సిన్...మొదటి ప్రాధాన్యత వారికే: కలెక్టర్లకు సీఎస్ ఆదేశం

By Arun Kumar P  |  First Published Jan 12, 2021, 2:57 PM IST

కోవిడ్19 వాక్సినేషన్ ప్రారంభించే కేంద్రాలలో నిర్దేశించిన ఆపరేషనల్ గైడ్ లైన్స్  ప్రకారం వసతులు కల్పించాలని కలెక్టర్లుకు సీఎస్ సూచించారు. 


హైదరాబాద్: ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ కు చేరుకున్న నేపథ్యంలో వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు చేపట్టనున్న వ్యవస్థాపరమైన ఏర్పాట్లను కలెక్టర్లతో సమీక్షించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం సీఎస్  టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

మొదటి దశలో ప్రభుత్వ, ప్రవేట్ రంగాల్లో పనిజేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లందరికి కోవిడ్19 వాక్సినేషన్ ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై కలెక్టర్లను సెన్సిటైజ్ చేశారు. వాక్సినేషన్ ప్రారంభించే కేంద్రాలలో నిర్దేశించిన ఆపరేషనల్ గైడ్ లైన్స్  ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు. అదేవిధంగా  ఎక్కడైనా ప్రతికూల ప్రభావం కనపడితే వెంటనే  తగు చర్యలు చేపట్టేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని  కలెక్టర్లకు సీఎస్ సూచించారు.

Latest Videos

undefined

read more  హైద్రాబాద్‌కి చేరుకొన్న కరోనా వ్యాక్సిన్: 1213 సెంటర్లలో వ్యాక్సినేషన్

వాక్సినేషన్ ప్రారంభోత్సవానికి నిర్దేశించిన ప్రతి కేంద్రంలో అన్ని ఏర్పాట్లను సమన్వయ పరిచేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని సూచించారు. ముందు జాగ్రత్తగా వాక్సినేషన్ ను  రిజర్వులో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. నెట్ వర్క్ ద్వారా  ముందుగా నిర్ణయించిన లబ్దిదారులను జిల్లా యంత్రాంగంచే వాక్సినేషన్ కేంద్రాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఈ వాక్సినేషన్ కు చాలా ప్రాదాన్యత ఉన్నందున ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సీఎస్ తెలిపారు. మొదటి రోజు కొద్దిమంది లబ్ధిదారులనే  వాక్సినేషన్ కేంద్రాలకు వచ్చే విదంగా చూసి ఆ అనుభవాలను బట్టి  ప్రణాళిక చేసుకొని మరుసటి రోజు నుండి లబ్ధిదారులను పెంచాలని సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

  

click me!