బీజేపీ గెలుస్తుందనే ఎన్నికలకు బ్రేక్ : వివేక్ వెంకటస్వామి

Published : Jan 12, 2021, 02:12 PM IST
బీజేపీ గెలుస్తుందనే ఎన్నికలకు బ్రేక్ : వివేక్ వెంకటస్వామి

సారాంశం

నాగార్జున సాగర్‌లో బీజేపీ గెలవబోతుందని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి జోస్యం చెప్పారు. వివేక్ వెంకటస్వామి మంగళవారం సంగారెడ్డి జిల్లా జహిరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

దుబ్బాకలో, జీహెచ్‌ఎంసీలో బీజేపీ విజయం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడుతోందన్నారు. వరుస ఓటముల తర్వాత సీఎం కేసీఆర్‌కి తెలిసొచ్చిందని అందుకే పథకాలపై సమీక్షలు జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. 

కరోనా సమయంలో ఆయుష్మాన్ భారతి పథకం ఉండుంటే ఎంతో మంది పేదవారికి ఉపయోగపడేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, అనుచరులు ఇంత కాలం దోచుకున్న డబ్బుని రాష్ట్ర ఖజానా‌కు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. జహిరాబాద్ ప్రాంతంలో చెరుకు రైతులకు బకాయిలు చెల్లించాలని కోరారు. 

జహిరాబాద్‌లో మున్సిపల్ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ గెలుస్తుందనే ఇక్కడ ఎన్నికలు జరపడం లేదన్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంలో కేసీఆర్ విఫలం అయ్యారన్నారు. నిమ్జ్ భూ నిర్వాసితుల సమస్యను పట్టించుకోవాలని.. వారికి మార్కెట్ ధర ఇవ్వాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే