ఊహించని రీతిలో కరోనా కేసులు, అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఈటల

By narsimha lodeFirst Published Apr 7, 2021, 5:35 PM IST
Highlights

రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సదుపాయాలతో పాటు కరోనా చికిత్సలు కూడ నిర్వహిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్, కర్ఫ్యూలు విధించబోమని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సదుపాయాలతో పాటు కరోనా చికిత్సలు కూడ నిర్వహిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్, కర్ఫ్యూలు విధించబోమని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు.  జిల్లాల్లోని ఆసుపత్రుల్లో కూడా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాల్లో సీరియస్ కేసుల్ని గాంధీ ఆసుపత్రికి తరలించనున్నట్టుగా ఆయన చెప్పారు.అన్ని ఆసుపత్రుల్లో మందులతో పాటు ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు సిబ్బందిని నియమించుకొనేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

ప్రైవేటీ ఆసుపత్రులు కూడా మానవత్వ థృక్పథంతో వ్యవహరించాలని ఆయన కోరారు.  కరోనా రోగుల నుండి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయవద్దని ఆయన ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా రోగులను వ్యాపార థృక్పథంతో చూడవద్దని ఆయన కోరారు.

ఊహించని రీతిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని మంత్రి చెప్పారు. మాస్కులను ధరించాలని ఆయన కోరారు. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని ఆయన సూచించారు.మహారాష్ట్ర నుండి ప్రతి రోజు రాష్ట్రానికి పెద్ద ఎత్తున రాకపోకలు సాగుతున్నాయన్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. తెలంగాణలో ప్రతిరోజూ లక్షమందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నామన్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే సిబ్బంది ఎవరూ కూడ సెలవులు పెట్టుకోవద్దన్నారు. 24 గంటల పాటు వైద్య సిబ్బంది ఫోన్లు పనిచేసేలా చూసుకోవాలని కోరారు.కరోనా రోగులు ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకొంటుంటే  వారికి మందులు అందిస్తామన్నారు. రోగులు నివాసం ఉంటున్న పీహెచ్‌సీ పరిధిలోని వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు వారి క్షేమ సమాచారాలు తెలుసుకొంటారని మంత్రి వివరించారు,
 

click me!