బాబు ఖేల్ ఖతమ్: టీఆర్ఎస్‌లోకి టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం

Published : Apr 07, 2021, 05:00 PM ISTUpdated : Apr 07, 2021, 05:14 PM IST
బాబు ఖేల్ ఖతమ్: టీఆర్ఎస్‌లోకి టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం

సారాంశం

 ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు  టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నారు.  

హైదరాబాద్:  ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు  టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో  తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది.  ఎన్నికలు పూర్తైన కొంత కాలానికి   సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.   

అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావును టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరాలని ఒత్తిడి ఉంది.  కానీ మచ్చా నాగేశ్వరరావు  టీడీపీని  వీడి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.  టీడీపీకి రాజీనామా చేసి ఆయన కొద్దిసేపట్లో టీఆర్ఎస్ లో చేరనున్నారు. టీఆర్ఎస్ లో చేరే సమయంలో టీడీపీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మచ్చా నాగేశ్వరరావు స్పీకర్ కు లేఖ అందించారు. మరో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మచ్చా నాగేశ్వరరావు బుధవారం నాడు స్పీకర్ ను కలిసి టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టుగా లేఖ అందించారు.

2014-2019 కాలంలో కూడ టీడీపీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు అప్పట్లో టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు అప్పటి స్పీకర్ కు లేఖలు ఇచ్చారు. ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పలు  పిటిషన్లు దాఖలయ్యాయి.
 

PREV
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం