ఇంటిమీద పడ్డ కోతుల గుంపు.. భయంతో గుండె ఆగి మహిళ మృతి...

Published : Mar 16, 2021, 10:21 AM IST
ఇంటిమీద పడ్డ కోతుల గుంపు.. భయంతో గుండె ఆగి మహిళ మృతి...

సారాంశం

కోతుల భయం ఓ మహిళ ప్రాణాలు తీసింది. అర్థాంతరంగా నిండు జీవితం ఆగిపోయింది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన కోతుల సమస్య తీవ్రతను పట్టిచెబుతున్నాయి. వివరాల్లోకి వెడితే...

కోతుల భయం ఓ మహిళ ప్రాణాలు తీసింది. అర్థాంతరంగా నిండు జీవితం ఆగిపోయింది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన కోతుల సమస్య తీవ్రతను పట్టిచెబుతున్నాయి. వివరాల్లోకి వెడితే...

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోతులు దాడి చేస్తాయేమోనన్న భయంతో ఓ మహిళ హార్ట్ ఎటాక్ తో చనిపోయింది. 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికిి చెందిన బట్టపల్లి మోహన్ ఉపాధి కోసం నాలుగేళ్ల కిందట కుటుంబంతో ధర్మారానికి వచ్చాడు. ఇక్కడే ఉంటూ వడ్రంగి పని చేస్తున్నాడు. దీంతోనే కుటుంబపోషణ నడుస్తోంది. 

అయితే మోహన్ కూతురు రేవతి(34)కి వివాహం అయ్యింది. ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబసమస్యల కారణంగా ధర్మారంలో తండ్రి దగ్గరే ఉంటుంది. ఎప్పట్లాగే ఆ రోజు కూడా ఉదయం ఇంట్లోనుంచి రేవతి బైటికి వస్తుంటే కోతులు గుంపులుగా వచ్చాయి. పెద్దగా అరుస్తూ ఇంట్లోకి రావడానికి ప్రయత్నించాయి. 

ఆ కోతుల గుంపును చూసిన రేవతి ఒక్కసారిగా భయంతో  కుప్పకూలిపోయింది. అది గమనించిన కుటుంబ సభ్యలు రేవతిని ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్టు తేలింది. గుండెపోటుతోనే రేవతి మరణించిందని వైద్యులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?