తెలంగాణలో కరోనా విజృంభణ: 97 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

Published : Aug 18, 2020, 09:27 AM IST
తెలంగాణలో కరోనా విజృంభణ: 97 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 97 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో 1682 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపి ఆగడం లేదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 97 వేలు దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 97937కు చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధితో 8 మంది మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 711కు చేరుకుంది. కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొంది ఇప్పటి వరకు 72,202 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 21,024 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో తగ్గుముఖం పట్టినట్లు అనిపించింది. కేసులు తాజాగా 24 గంటల్లో పెరిగిన కేసుల సంఖ్య కాస్తా తక్కువగానే ఉంది.. జిహెచ్ఎంసీ పరిధిలో గత 24 గంటల్లో 235 కేసులు నమోదయ్యాయి. 

జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కరోనా కేసులు

ఆదిలాబాద్ 18
భద్రాద్రి కొత్తగూడెం 27
జిహెచ్ఎంసీ 235
జగిత్యాల 59
జనగామ 32
జయశంకర్ భూపాలపల్లి 19
జోగులాంబ గద్వాల 69
కామారెడ్డి 44
కరీంనగర్ 88
ఖమ్మం 45
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 9
మహబూబ్ నగర్ 32
మహబూబాబాద్ 13
మంచిర్యాల 79
మెదక్ 36
మేడ్చెల్ మల్కాజిగిరి 106
ములుగు 17
నాగర్ కర్నూలు 30
నల్లగొండ 38
నారాయణపేట 11
నిర్మల్ 27
నిజామాబాద్ 94
పెద్దపల్లి 59
రాజన్న సిరిసిల్ల 47
రంగారెడ్డి 166
సంగా రెడ్డి 18
సిద్ధిపేట 47
సూర్యాపేట 39
వికారాబాద్ 7
వనపర్తి 23
వరంగల్ రూరల్ 20
వరంగల్ అర్బన్ 107
యాదాద్రి భువనగిరి 21
మొత్తం 1682

 

PREV
click me!

Recommended Stories

NTR 103rd Jayanti: ఎన్టీఆర్ 103వ జయంతి నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu
Monsoon Update : బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లోకి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలను తాకేదెన్నడో తెలుసా..?