బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయిన యువకులు: కాపాడిన మత్స్యకారులు, చివరికిలా....

Published : Aug 17, 2020, 09:47 PM IST
బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయిన యువకులు: కాపాడిన మత్స్యకారులు, చివరికిలా....

సారాంశం

భారీ వర్షాల కారణంగా  వరదల్లో ఇద్దరు యువకులు కొట్టుకుపోతుండగా మత్స్యకారులు వారిని కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకొంది.  


కరీంనగర్: భారీ వర్షాల కారణంగా  వరదల్లో ఇద్దరు యువకులు కొట్టుకుపోతుండగా మత్స్యకారులు వారిని కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకొంది.

కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్-జాగిర్‌పల్లి మధ్య చెరువు నుండి అలుగు పోస్తోంది. కల్వర్టు వద్ద వరద ఉధృతి ఎక్కువైంది. ఇద్దరు యువకులు ఈ కల్వర్టు దాటే క్రమంలో వరదనీటిలో బైక్ తో సహా పడిపోయారు.

కల్వర్టు మీద వరద నీటిని అంచనా వేయడంలో  యువకులు అంచనా వేయడంలో పొరపాటుపడ్డారు. కల్వర్టు మీద వరద ఉధృతికి బైక్ తో   సహా ఇద్దరు కొట్టుకుపోయారు. 

అయితే వరద నీటిలో చేపలు పడుతున్న మత్స్యకారులు గమనించి వారిని కాపాడారు. తాడు సహాయంతో వరదలో కొట్టుకుపోతున్న ఇద్దరిని మత్స్యకారులు కాపాడారు.బైక్ తో సహా ఒడ్డుకు లాగారు మత్స్యకారులు.

ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రాణాలతో బయటపడిన యువకులు  అక్కడి నుండి వెళ్లిపోయారు. తాము ఎక్కడి ప్రాంతమో చెప్పకుండా వారు వెళ్లిపోయారు. అయితే  యువకుల కోసం ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?