మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమవ్వాల్సిందే..

Published : Aug 02, 2021, 01:42 PM ISTUpdated : Aug 02, 2021, 01:44 PM IST
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమవ్వాల్సిందే..

సారాంశం

ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 422కి చేరడం గమనార్హం.  మొత్తం కేసులు 3.16కోట్లకు చేరగా.. 4.24లక్షల మంది మహమ్మారి కి బలయ్యారు.

కరోనా మహమ్మారి విషయంలో.. అందరం అప్రమత్తమవ్వాల్సిన పరిస్థితి మళ్లీ ఏర్పడింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గత కొద్దిరోజుల ప్రతిరోజూ 40వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా 14,28,984 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 40,134 మందికి పాజిటివ్ గా తేలింది.

మరీ ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభణ ఎక్కువగా కనపడుతోంది. అక్కడ మళ్లీ 20వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇక ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 422కి చేరడం గమనార్హం.  మొత్తం కేసులు 3.16కోట్లకు చేరగా.. 4.24లక్షల మంది మహమ్మారి కి బలయ్యారు.

ఇటీవల కాలంలో క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో 4,13,718 మంది వైరస్ తో బాధపడుతుండగా.. క్రియా శీల రేటు 1.30 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది. నిన్న 36,946 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు వైరస్ ని జయించిన వారి సంఖ్య 3.08 కోట్లుగా ఉంది. మరో వైపు నిన్న 17లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. మొత్తంగా 47.22కోట్ల డోసుల పంపిణీ అయినట్లు కేంద్రం వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే