వంటగదిలో గొంతుకోసి.. లాయర్ హత్య.. మరో నలుగురి అరెస్ట్.. !

By AN TeluguFirst Published Aug 2, 2021, 9:22 AM IST
Highlights

జూలై 29 న, అడ్వకేట్ రాయీస్ ఫాతిమా (41) ని ఆమె సోదరుడు ఎండీఫ్ అలీ (38) టోలిచౌకిలోని ఆమె ఇంట్లో హత్య చేశాడు. రాయిస్ ఫాతిమా వంటగదిలో ఉన్నప్పుడు నిందితుడు ఆమెతో గొడవ పడి, గొంతు కోసి చంపేశాడని గోల్కొండ ఇన్‌స్పెక్టర్ కె. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ : ఇటీవల టోలిచౌకిలో న్యాయవాది రయీస్ ఫాతిమా హత్య కేసులో మరో నలుగురు వ్యక్తులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురూ బాధితురాలి కుటుంబ సభ్యులే. ఆస్తి వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. నిందితుడు, ఫాతిమా సోదరుడు ఎండీ ఆరిఫ్ అలీని అదే రోజు అరెస్టు చేశారు.

జూలై 29 న, అడ్వకేట్ రాయీస్ ఫాతిమా (41) ని ఆమె సోదరుడు ఎండీఫ్ అలీ (38) టోలిచౌకిలోని ఆమె ఇంట్లో హత్య చేశాడు. రాయిస్ ఫాతిమా వంటగదిలో ఉన్నప్పుడు నిందితుడు ఆమెతో గొడవ పడి, గొంతు కోసి చంపేశాడని గోల్కొండ ఇన్‌స్పెక్టర్ కె. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

హత్య చేసిన తర్వాత, ఆరిఫ్ అలీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణలో, అతని భార్య సమీన్ బేగం, అతని ముగ్గురు సోదరులు - ఎండీ రవూఫ్ అలీ (40), ఎండీ హసన్ అలీ (36), ఎండీ ఆసిఫ్ అలీ (37), ఆరిఫ్ అలీ హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. మొత్తం ఐదుగురు నిందితులను శనివారం రాత్రి అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

నిందితుడి తండ్రి, ఇటీవల మరణించిన మహ్మద్ ఫకీర్ అలీకి నగరంలో అనేక ఆస్తులు ఉన్నాయి. అతను బతికి ఉన్నప్పుడు, అతను తన ఐదుగురు కుమార్తెలకు 400 చదరపు గజాల ఆస్తిని ఇవ్వాలని అనుకున్నాడు. అయితే, అతని ఐదుగురు కొడుకులకు ఇది ఇష్టం లేదు. 

ఇటీవల, నిందితుడి సోదరిలలో ఒకరైన అయేషా ఫాతిమా.. పూర్వీకుల ఆస్తి గురించి స్థానిక కోర్టులో సివిల్ దావా వేశారు. దీంతో, కోర్టు ఆమె తోబుట్టువులందరికీ సమన్లు ​​జారీ చేసింది. కాగా, "రయీస్ ఫాతిమానే తన సోదరితో సివిల్ దావా వేయించిందని అనుమానించిన నిందితుడు.. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రయీస్ ఫాతిమా ఇంటికి వెళ్లిన ఆరీఫ్ అలీ.. మొదట ఆమెతో గొడవ పడ్డాడు. ఆ తరువాత ఆమె గొంతు కోసి హత్య చేశారు. మిగతా ఇతర నిందితులు ఆమెను చంపడానికి ప్రోత్సహించారు" అని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. 

click me!