దళిత బంధు ప్రాజెక్టు ప్రయోగాత్మక అమలుపై కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. దళిత బంధు పథకంపై దాఖలైన పీల్ పై అత్యవసరంగా విచారణ చేపట్టలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
హైదరాబాద్: దళిత బంధు పథకంపై అత్యవసరంగా విచారణ జరపలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. దళిత బంధుపై అత్యవసరంగా విచారించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుజూరాబాద్ లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం నిర్ణయించింది.
పైలట్ ప్రాజెక్టు అమలును నిలిపేయాలని పటిషన్లు కోరారు. లిస్టింగ్ ప్రచారం పిటిషన్ మీద విచారణ చేపపడుతామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెసు, బిజెపిలను, ఈసీని, టీఆర్ఎస్ ను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని ప్రోయగాత్మకంగా అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ అంన్నారు.
undefined
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రయోజనం పొందేందుకు కేసీఆర్ ప్రబుత్వం అక్కడ దళిత బంధు ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి సిద్ధపడిందనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గం రాజకీయాలు వేడెక్కాయి.
ఈటల రాజేందర్ తన శాసనసభ సభ్యత్వానికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. హుజూరాబాద్ నుంచి బిజెపి తరఫున పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఇటీవల ప్రజా దీవెన పాదయాత్రలో అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెసు నాయకుడు కౌశిక్ రెడ్డి, బిజెపి నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.