నల్గొండ జిల్లాలలో కరోనా కలకలం.. గురుకుల పాఠశాలలో 29 మంది విద్యార్థులకు పాజిటివ్

Published : Jul 21, 2022, 10:29 AM IST
నల్గొండ జిల్లాలలో కరోనా కలకలం.. గురుకుల పాఠశాలలో 29 మంది విద్యార్థులకు పాజిటివ్

సారాంశం

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా నల్గొండ జిల్లాలో కరోనా కలకలం రేపింది. 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా నల్గొండ జిల్లాలో కరోనా కలకలం రేపింది. జిల్లాలోని కొండమల్లెపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పాఠశాలలోనే ఐసోలేషన్‌లో ఉంచారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో వరుసగా రెండు రోజు 600కు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మంగళవారం 658 కరోనా కేసులు నమోదుకాగా, బుధవారం 640 కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటివరకు రోజువారీ కేసుల సంఖ్య నాలుగు సార్లు 600 మార్క్‌ను దాటింది. తాజాగా నమోదైన 640 కేసులతో కలిపి.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం  కోవిడ్ కేసుల సంఖ్య 8,11,616 కు చేరింది. ఇక, బుధవారం మొత్తం 31,265 నమూనాలను పరీక్షించినట్టుగా ప్రభుత్వం విడుదల చేసిన డేటా వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పుటివరకు 3.61 కోట్ల నమూనాల పరీక్షను పూర్తి చేశారు. 

కొత్త కేసుల్లో.. హైదరాబాద్‌లో  227, రంగారెడ్డిలో 50, మేడ్చల్ మల్కాజిగిరిలో 45, ఖమ్మంలో 32 కేసులు ఉన్నాయి. బుధవారం రోజున 659 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,03,013కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,492గా ఉంది. కొత్తగా మరణాలు ఏమి నమోదు కాకపోవడంతో.. ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 4,111గానే ఉంది.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ