కేసీఆర్ కు కరోనా: కొంప ముంచిన నాగార్జునసాగర్ ప్రచార సభ?

By telugu team  |  First Published Apr 19, 2021, 8:02 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచార సభ కారణంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చిందనే ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు కరోనా రావడం ఆ విషయాన్ని బలపరుస్తోంది.


నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ శాసనసభకు జరిగిన ఉప ఎన్నిక కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కరోనా వైరస్ సోకినట్లు అర్థమవుతోంది. కరోనా విస్తరిస్తున్న స్థితిలో లక్ష మందితో కేసీఆర్ సభ ఎలా పెడుతారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఆ ప్రశ్నకు కేసీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభల్లో పాల్గొనగా లేనిది, తాను పాల్గొంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు 

కోరనా విస్తరణను బేఖాతరు చేస్తూ ఆయన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచార సభలో పాల్గొన్నారు. అదే కేసీఆర్ కు కరోనా సోకడానికి కారణమైందనే ప్రచారం సాగుతోంది. నోముల భగత్ కు కరోనా పాజిటివ్ రావడం ఆ విషయాన్ని బలపరుస్తోంది.  తెలంగాణలోని నాగార్జునసాగర్ లో కరోనా పంజా విసిరింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ, పోలింగులోనూ కరోనా వైరస్ వ్యాపించినట్లు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి నోముల భగత్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ సోకింది. టీఆర్ఎఎస్ నేత కోటిరెడ్డికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. బిజెపి, కాంగ్రెసులకు చెందిన పలువురు నాయకులకు కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. 

Latest Videos

undefined

Also Read: కేసీఆర్‌కి కరోనా: హోం క్వారంటైన్‌లో తెలంగాణ సీఎం

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా వైరస్ నానానిటీకీ విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 83,089మందికి కరోనా టెస్టులు చేయగా 4009మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,55,433కు చేరితే టెస్టుల సంఖ్య 1,18,20,842కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 1878మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,14,4413కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,154యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 14 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1838కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.51శాతంగా వుంటే దేశంలో ఇది 1.2శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 86శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 88.46శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 39, నాగర్ కర్నూల్ 33, జోగులాంబ గద్వాల 32, కామారెడ్డి 115, ఆదిలాబాద్ 72, భూపాలపల్లి 22, జనగామ 34, జగిత్యాల 175, అసిఫాబాద్ 25, మహబూబ్ నగర్ 129, మహబూబాబాద్ 36, మెదక్ 60, నిర్మల్ 90, నిజామాబాద్ 360,  సిరిసిల్ల 80, వికారాబాద్ 65, వరంగల్ రూరల్ 49,  ములుగు 26, పెద్దపల్లి 39, సిద్దిపేట 125, సూర్యాపేట 69, భువనగిరి 20, మంచిర్యాల 111 నల్గొండ 58 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 705కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 363, రంగారెడ్డి 336, కొత్తగూడెం 49, కరీంనగర్ 135, ఖమ్మం 113, సంగారెడ్డి 264, వరంగల్ అర్బన్ 146కేసులు నమోదయ్యాయి.

click me!