జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో కరోనా కలవరం సృష్టిస్తోంది.
కరీంనగర్: జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో కరోనా కలవరం సృష్టిస్తోంది. కేవలం ఒక్కరోజే జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసులు కరోనా బారినపడ్డారు. మొత్తంగా ఆదివారం ఒక్కరోజే ఈ జిల్లాలో 31కరోనా కేసులు నమోదయ్యాయి.
జగిత్యాల పట్టణంతో పాటు మొత్తం మండలంలో 16, కొడిమ్యాల-3, పెగడపల్లి-2, గొల్లపల్లి-2, కోరుట్ల, రాయికల్, వెల్గటూర్, బీర్‌పూర్, మెట్‌పల్లి మండలాల్లో మిగతా కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని అరవింద్‌నగర్‌లో ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్‌గా తేలగా, సుభాష్‌నగర్‌లో 60ఏళ్ల మహిళకు పాజిటివ్‌గా నిర్ధరించారు.
undefined
తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 172కు చేరింది. అందులో 96 మంది కోలుకోగా ముగ్గురు మృతి చెందారు. 73 మందిలో ఇళ్లలో కొందరు, ఆస్పత్రుల్లో మరికొందరు చికిత్స పొందుతున్నారు.
read more చిలుకూరు ఆలయంలో అద్బుతం... కరోనా అంతానికి సూచిక అంటున్న రంగరాజన్ (వీడియో)
మొత్తంగా తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఆదివారం రాష్ట్రంలో 1,296 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 45,076కి చేరింది. ఒక్కరోజే రాష్ట్రంలో కోవిడ్‌తో ఆరుగురు మరణించారు.
వీరితో తెలంగాణలో మృతుల కేసుల సంఖ్య 415కి చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటి వరకు 32,438 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 557 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. రంగారెడ్డి 111, వరంగల్ అర్బన్‌లో 117 మందికి పాజిటివ్‌గా తేలింది.