టీఆర్ఎస్ కార్యాలయం స్థల వివాదం: భూపాల్‌పల్లిలో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Jun 24, 2019, 11:22 AM IST
టీఆర్ఎస్ కార్యాలయం స్థల వివాదం: భూపాల్‌పల్లిలో ఉద్రిక్తత

సారాంశం

రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం సోమవారం నుంచి శంకుస్థాపనలు జరగనున్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో వివాదం రాజుకుంది

రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం సోమవారం నుంచి శంకుస్థాపనలు జరగనున్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో వివాదం రాజుకుంది. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించిన భూమి తనదేనంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సోదరుడు సత్యనారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో ఆ స్థలం వద్ద సత్యనారాయణ రెడ్డి అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే సదరు స్థలం ప్రభుత్వానిదేనని రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శంకుస్థాపన జరగకుండా సత్యనారాయణ లారీలను అడ్డుపెట్టడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శంకుస్థాపన ఎలా చేస్తారో చూస్తానని నారాయణరెడ్డి.. అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

కాగా సోమవారం ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లో శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. తొమ్మిది చోట్ల మంత్రులు, మిగిలిన చోట్ల జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్లు శంకుస్థాపన చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్