జగన్ ని ఫాలో అవుతున్న కేసీఆర్.. పోలీసులకు వీక్లీఆఫ్

Published : Jun 24, 2019, 10:36 AM IST
జగన్ ని ఫాలో అవుతున్న కేసీఆర్.. పోలీసులకు వీక్లీఆఫ్

సారాంశం

పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నూతన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీసు కుటుంబాల్లో ఆనందాలను నింపింది.

పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నూతన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీసు కుటుంబాల్లో ఆనందాలను నింపింది. కాగా ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్... ఏపీ సీఎం జగన్ ని ఫాలో అవుతున్నారు.

ఏపీ మాదిరిగానే తెలంగాణలోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానం అమలుచేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఓ విధానంగా అమలు చేయాలనే నిర్ణయం తీసుకోనప్పటికీ జిల్లాలు, కమిషనరేట్‌ల వారీగా అవకాశాన్ని బట్టి సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలనే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు. 

తుదిదశలో ఉన్న పోలీసు నియామక ప్రక్రియ పూర్తయి, కొత్త సిబ్బంది విధుల్లో చేరిన తర్వాత వారాంతపు సెలవులను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులివ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పోలీసు శాఖలో డీఎస్పీ, ఆపై అధికారులు వారాంతపు సెలవులను తీసుకుంటారు. 

క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సీఐ నుంచి కానిస్టేబుళ్ల వరకూ వీక్లీ ఆఫ్ సాధ్యం కాదు. దీనికి అనేక కారణాలు సాకుగా చూపిస్తుంటారు. సిబ్బంది కొరత, విధులు పెరిగిపోవడం లాంటి కారణాలతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి వారాంతపు సెలవులు అమలు చేయడం సాధ్యం కాదని తేల్చేశారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా భువనేశ్వరి Nara Bhuvaneshwari Pays Tribute At NTR
NTR 103rd Jayanti: ఎన్టీఆర్ 103వ జయంతి నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu