ఒక్క మార్కుతో తాను అనుకున్న ఉద్యోగం రాలేదని తెలిసిన ఓ కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నేటి యువత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేకపోతున్నారు. కొంచెం ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమ్మ తిట్టిందనో.. నాన్న కొట్టాడనో.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో..ప్రేమలో విఫలమైందనో.. నచ్చిన జాబ్ రాలేదనో.. ఇలా చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రతి చిన్నా పెద్ద సమస్యకు ఆత్మహత్య పరిష్కారమని భావిస్తున్నారు. ముందు వెనుక ఆలోచించకుండా.. చావుతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని ఓ యవకుడు ఎంతగానో కష్టపడ్డారు. కానీ.. ఆ యువకుడు కన్న కలలు అన్ని కలలుగానే మిగిలిపోయాయి. ఒక్క మార్కుతో ఆ యువకుడు కలలు కన్న పోలీసు ఉద్యోగం మిస్సాయింది. దీంతో ఆ యువకుడు తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రానికి చెందిన నర్సింలు, దౌలమ్మ ల కొడుకు దేవా అర్జున్ (25). ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యారు. ప్రిలిమినరీ, ఈవెంట్స్ ల్లో మంచి ప్రతిభ కనబరిచాడు. కానీ మెయిన్స్ పరీక్షలో తాను అనుకున్న విధంగా రాణించలేకపోయాడు. తాజాగా విడుదలైన కానిస్టేబుల్ తుది పరీక్ష ఫలితాల్లో (జాబితాలో) స్థానం కైవసం చేసుకోలేకపోయాడు.
ఒక్క మార్క్ లో ఆ యువకుడు అనుకున్న పోలీసు కానిస్టెబుల్ జాబ్ మిస్ అయ్యింది. దీంతో తీవ్ర మానస్థాపానికి గురైన దేవా అర్జున్.. గురువారం నాడు ఆఘాయిత్యానికి పాల్పడుతాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రలకు తన కూమారుడు విగత జీవిగా కనిపించడంతో షాక్ గురయ్యారు. చేతికి వచ్చిన కొడుకు జీవశవంలా పడుకుని ఉంటే.. వారి బాధ వర్ణననీతం.దేవ్ అర్జున్ చావుతో గ్రామంలో విషాద ఛాయలు అలువుకున్నాయి.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.