MLC KAVITHA:  లండన్ కు బయలుదేరి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. మహిళల భాగస్వామ్యంపై కీలకోపన్యాసం..

By Rajesh Karampoori  |  First Published Oct 5, 2023, 11:48 PM IST

MLC KAVITHA: పబ్లిక్ పాలసీకి సంబంధించి ప్రముఖ 'బ్రిడ్జ్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం రోజున లండన్ కు బయలుదేరి వెళ్లారు. 


MLC KAVITHA:  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అరుదైన గౌరవం దక్కింది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, రిజర్వేషన్లపై ప్రసంగించాలని లండన్ లోని 'బ్రిడ్జ్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థ ఆహ్వానించింది. వారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ కవిత గురువారం రోజున లండన్ కు బయలుదేరి వెళ్లారు. అక్టోబర్ 6న లండన్‌లోని సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్ లో "మహిళా రిజర్వేషన్ చట్టం - ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం" అనే అంశంపై 'బ్రిడ్జ్ ఇండియా' సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఈ  సమావేశంలో కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. 
 
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమ తీరుతెన్నులు, ఈ రిజర్వేషన్ల ద్వారా జరగబోయే మేలు, చట్టసభల్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెంచడం, రాజకీయాల్లో మహిళల పాత్ర వంటి అంశాలపై ఎమ్మెల్సీ కవిత ప్రసంగించనున్నారు.  సాగనుంది. అయితే.. అదే రోజు ఉదయం లండన్ లోని అంబేద్కర్ హౌస్ మ్యూజియం ను సందర్శించనున్నారు. ఇక శనివారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అండ్ అలుమిని యూనియన్ యూకే  నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని కవిత మాట్లాడుతారు.

అంతకు ముందు.. 'బ్రిడ్జ్ ఇండియా' సంస్థ ఎమ్మెల్యే కవితను ఆహ్వానిస్తూ.. రాజకీయాలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి ఎమ్మెల్సీ కవిత ఎంతగానో కృషి చేశారని సదరు సంస్థ పేర్కొన్నది. అంతే కాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ మంత్రి అనేక ఆందోళనలు చేపట్టారని,వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంలో కవిత కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది.  

Latest Videos

ఇది సమయంలో మహిళా బిల్లు కోసం  ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 6 వేల మందితో ధర్నా చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ ఆందోళనల్లో  మహిళా, విద్యార్థి, రైతు సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారని చెప్పింది. లండన్‌లో నిర్వహించే సదస్సులో మహిళా బిల్లుతో తన ప్రయాణాన్ని ఎమ్మెల్సీ కవిత కూలంకషంగా వివరిస్తారని, అలాగే ఆ బిల్లు వల్ల కలిగే లాభాలను కూడా చెప్తారని 'బ్రిడ్జ్ ఇండియా' పేర్కొన్నది.

click me!