కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

By Nagaraju T  |  First Published Nov 14, 2018, 7:07 PM IST

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ  కండువా కప్పుకోనున్నారని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల్లో లోపు అంటే బ్యాలెట్‌ బాక్స్‌ల్లో ఓట్లు పడేలోపు ఎంపీలిద్దరూ కాంగ్రెస్ పార్టీ గూటికి వస్తారని తెలిపారు.  
 


కొడంగల్‌: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ  కండువా కప్పుకోనున్నారని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల్లో లోపు అంటే బ్యాలెట్‌ బాక్స్‌ల్లో ఓట్లు పడేలోపు ఎంపీలిద్దరూ కాంగ్రెస్ పార్టీ గూటికి వస్తారని తెలిపారు.  

తన నియోజకవర్గమైన కొడంగల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఎంపీల జంపింగ్ పై కుండబద్దలు కొట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కొడంగల్‌లో కాంగ్రెస్‌ గెలవడం ఖాయమన్నారు. తనకు 30వేల మెజార్టీ వస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. 

Latest Videos

ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తన విజయాన్ని ఆపలేరన్నారు. టీఆర్ఎస్ పతనం త్వరలో ప్రారంభం కాబోతోందని రేవంత్ చెప్పారు. త్వరలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈనెల 19న కొడంగల్‌లో నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు రేవంత్ తెలిపారు. 

అయితే కాంగ్రెస్ లో చేరబోయే ఆ ఇద్దరు ఎంపీలు ఎవరా అన్న సందేహం అటు టీఆర్ఎస్ పార్టీలోనూ ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ చర్చ మెుదలైంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎంతో కొంత వాస్తవం ఉంటుందని రాజకీయ నేతలు భావిస్తున్నారు. మెుత్తానికి రేవంత్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మ ారాయి. 

click me!